ICC ODI Rankings | హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ వరల్డ్ నెంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు. ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాకింగ్స్లో ఎనిమిది స్థానాలను మెరుగుపరుచుకొని అగ్రస్థానానికి చేరుకున్నాడు. 694 పాయింట్లతో టాప్ వన్ బౌలర్‌గా నిలిచాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటాడు. సిరాజ్ నిప్పులు చెరిగే బంతులకు శ్రీలంక జట్టు కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. 21 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టిన హైదరాబాదీ బౌలర్ ఐసీసీ వన్డే ర్యాకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఆస్ట్రేలియా బౌలర్ జాష్ హేజిల్‌వుడ్‌ను వెనక్కి నెట్టి నెంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు. హేజిల్‌వుడ్ 678 పాయింట్లో రెండో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ బౌలర్ బౌల్ట్ 677 పాయింట్లతో మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. ఆఫ్ఘన్ స్పిన్ ద్వయం ముజీజ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ సైతం తమ ర్యాకింగ్స్‌ను మెరుగుపరుచుకొని మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. వన్డే బ్యాటింగ్ ర్యాకింగ్స్లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అగ్రస్థానంలో ఉండగా.. భారత ఓపెన్ శుభ్‌మన్ గిల్ రెండోస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఎనిమిదో స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ పదో స్థానంలో కొనసాగుతున్నాడు.