Runout at Non-Striker End | వచ్చే ఏడాది నేను కూడా మన్కడ్ రనౌట్ చేస్తా.. ఐపీఎల్ స్టార్ ట్వీట్ వైరల్
Runout at Non-Striker End | ఇటీవలి కాలంలో క్రికెట్లో బాగా ట్రెండ్ అయిన విషయం దీప్తిశర్మ చేసిన రనౌట్. దీనిపై ప్రపంచ క్రికెట్ ప్రముఖుల మధ్య కూడా హాట్ హాట్‌గా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇటీవలి కాలంలో క్రికెట్లో బాగా ట్రెండ్ అయిన విషయం దీప్తిశర్మ చేసిన రనౌట్. దీనిపై ప్రపంచ క్రికెట్ ప్రముఖుల మధ్య కూడా హాట్ హాట్‌గా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. రాజస్థాన్ తరఫున ఫినిషర్‌గా ఆడుతున్న రియాన్ పరాగ్.. తాజాగా ఒక ట్వీట్ చేశాడు.
దానిలో తను కూడా వచ్చే ఏడాది ఐపీఎల్లో ఎవరో ఒకరిని మన్కడ్/రనౌట్ చేస్తానని, అప్పుడు మంచి ట్విట్టర్ డిబేట్ మొదలవుతుందని చెప్పాడు. తాజాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ సమయంలో కూడా ఈ విషయం చర్చకు దారితీసింది. తను బౌలింగ్ చేసే సమయంలో ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ త్వరగా క్రీజు దాటేస్తున్నాడని మిచెల్ స్టార్క్ హెచ్చరించాడు.
ఈ సమయంలో తాను దీప్తిశర్మను కానని, కానీ క్రీజు దాటడం కరెక్ట్ కాదని చెప్పాడు. ఈ మ్యాచ్ అనంతరం బట్లర్ మాట్లాడుతూ.. తనకు ఈ తరహా రనౌట్ చేయడం ఇష్టం ఉండదని, అభిమానులు కూడా ఇది చూడటానికి ఇష్టపడరని చెప్పాడు. కాగా, ఐపీఎల్లో ఇప్పటి వరకు బట్లర్ రెండుసార్లు ఇలా నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్ అయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

