Football | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐ లీగ్‌లో భాగంగా మహమ్మదన్ ఎఫ్‌సీతో జరిగిన పోరును శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ ‘డ్రా’ చేసుకుంది. గురువారం హోరాహోరీగా సాగిన పోరు చివరకు 1-1తో సమమైంది. మ్యాచ్ ఆరంభంలోనే డేవిడ్ చేసిన గోల్‌తో శ్రీనిధి జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లగా.. మరికాసేపట్లో మ్యాచ్ ముగుస్తుందనగా.. మహమ్మదన్ జట్టు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ జాసిమ్ గోల్ చేసి స్కోర్లు సమం చేశాడు. లీగ్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన శ్రీనిధి డెక్కన్ టీమ్ 33 పాయింట్లతో పట్టిక రెండో స్థానంలో కొనసాగుతుండగా.. మమ్మదన్ జట్టు 35 పాయింట్లతో టాప్‌లో ఉంది.