David Warner | కెప్టెన్సీ నుంచి నన్ను ఎందుకు తీసేశారో ఎవరూ చెప్పలేదు!
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో మొదటి నుంచీ అత్యంత నిలకడగా రాణిస్తున్న ప్లేయర్ డేవిడ్ వార్నర్( David Warner ).

దుబాయ్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో మొదటి నుంచీ అత్యంత నిలకడగా రాణిస్తున్న ప్లేయర్ డేవిడ్ వార్నర్( David Warner ). కెప్టెన్‌గా కూడా 2016లో టైటిల్ అందించాడు. ఆ సీజన్లో వార్నర్ డాషింగ్ బ్యాటింగే టీమ్‌కు ట్రోఫీ తీసుకొచ్చింది. అలాంటి వార్నర్ ఈ సీజన్లో అనుకున్న రీతిలో రాణించలేదు. దీంతో అతన్ని ముందు కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆ తర్వాత మొత్తం టీమ్‌లో నుంచే తీసేసి.. కనీసం స్టేడియానికి కూడా రాకుండా అడ్డుకున్నారు.
అయినా సన్‌రైజర్స్ టీమ్‌ను చీర్ చేసిన వార్నర్.. ఇప్పుడు తనను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై తొలిసారి స్పందించాడు. అసలు తనను ఎందుకు తీసేశారో ఎవరూ కారణం చెప్పలేదని అన్నాడు. ట్రెవర్ బేలిస్, వీవీఎస్ లక్ష్మణ్, టామ్ మూడీ, ముత్తయ్య మురళీధరన్ ఓ నిర్ణయం తీసుకున్నారంటే అది కచ్చితంగా ఏకగ్రీవమే అయి ఉంటుంది. ఎవరు మద్దతిచ్చారు, ఎవరు ఇవ్వలేదో మనము చెప్పలేము అని వార్నర్ అన్నాడు.
అయితే కొన్ని సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయని చెప్పాడు. నన్ను కెప్టెన్‌గా ఎందుకు తొలగించారో చెప్పకపోవడం అసంతృప్తి కలిగించింది. ఫామ్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఈ నిర్ణయం తీసుకోరని అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఆడిన దానికి కాస్త విలువ ఉంటుంది. అందులోనూ ఫ్రాంచైజీకి 100కుపైగా మ్యాచ్‌లు ఆడాను. ఇప్పటికే ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇక రాదని నాకు తెలుసు అని వార్నర్ అన్నాడు. అయితే వచ్చే ఏడాది కూడా సన్‌రైజర్స్‌కు ఆడటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం విశేషం. ఎవరికి ఆడినా నా 100 శాతం ప్రదర్శన ఇస్తాను అని వార్నర్ అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

