భారత లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇప్పటి వరకూ తన వద్ద మహేంద్ర సింగ్ ధోనీ మొబైల్ నెంబర్ ఇప్పటి వరకూ లేదని రవిశాస్త్రి వెల్లడించాడు. తను ఎప్పుడూ ధోనీ మొబైల్ నెంబర్ అడగలేదని వెల్లడించాడు.
‘‘ధోనీ తన వెంటన మొబైల్ ఫోన్ పెట్టుకొని తిరగడని నాకు తెలుసు. అందుకేనేమో నేనెప్పుడూ అతని మొబైల్ నెంబర్ అడగలేదు’’ అని చెప్పాడీ మాజీ కోచ్. అదే సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ వంటి మరో ఆటగాడిని తన కెరీర్లో ఎప్పుడూ చూడలేదన్నాడు.
కాగా, ఇటీవల కోహ్లీ విజయాలను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారంటూ రవిశాస్త్రి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అందుకే కోహ్లీ తన టెస్టు కెప్టెన్సీని వదులుకున్నాడని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం రవిశాస్త్రి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.