Rohit Sharma | ముంబై ఇండియన్స్‌తో పుష్కర కాలం.. ఐపీఎల్లో రోహిత్ అరుదైన ఘనత
రోహిత్‌ను 2011 జనవరి 8న రూ.9 కోట్లకు ముంబై ఇండియన్స్ కొన్నది
Rohit Sharma : ఐపీఎల్లో పరుగుల వరద పారించే రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీతో ఎక్కువ రోజులు కొనసాగి రికార్డు సాధించాడు. ఈ ఫ్రాంఛైజీతో రోహిత్ ఈరోజుకు పుష్కర కాలం పూర్తి చేసుకున్నాడు. 2011 జనవరి 8న వేలంలో ముంబై ఇండియన్స్ రోహిత్‌ను రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఈ స్టార్ ఆటగాడు అదే జట్టుతో కొనసాగుతున్నాడు. ‘ముంబై ఇండియన్స్‌తో 12 ఏళ్లు కొనసాగాను అంటే నమ్మలేకపోతున్నా. ఇది చాలా ఆసక్తికరమైన, ఎమోషనల్‌తో కూడిన జర్నీ. ఈ ప్రయాణంలో మనందరం ఎంతో సాధించాం. ముంబై ఇండియన్స్ అనేది నా ఫ్యామిలీ. ఈ సందర్భంగా.. యాజమాన్యం, జట్టు సభ్యులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరిన్ని జ్ఞాపకాలు సొంతం చేసుకునేందుకు, నవ్వులు పంచేందుకు ఎదురుచూస్తున్నా’ అని రోహిత్ అన్నాడు.
తిరుగులేని కెప్టెన్
ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్ మొదటి స్థానంలో ఉంటాడు. తన సారథ్యంలో ముంబైని తిరుగులేని జట్టుగా తీర్చిదిద్దాడు. అందుకు నిదర్శనంగా.. ఈ ఫ్రాంఛైజీ 5 సార్లు (2013, 2015, 2017, 2019, 2020) ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఆ జట్టుకు ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉన్నది కూడా రోహితే. అంతేకాదు ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసింది కూడా అతనే. 182 మ్యచుల్లో రోహిత్ 4,709 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెప్టెన్‌గా 81 విజయాలతో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. అతని కెప్టెన్సీలో ముంబై 143 మ్యాచులు ఆడిన ముంబై ఇండియన్స్ 81 సార్లు గెలిచింది
ధోనీ తర్వాత…
ఐపీఎల్లో ఒక ఫ్రాంఛైజీకి ఎక్కువ రోజులు కెప్టెన్‌గా రెండో ఆటగాడిగా రోహిత్ గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి స్థానంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్.ధోనీ ఉన్నాడు. అతను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో గాయపడిని రోహిత్ మళ్లీ కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో అదరగొట్టాలని భావిస్తున్నాడు. తొలి వన్డే జనవరి 10న గువాహటిలో జరగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

