Vritti Agarwal | ఆసియా క్రీడలకు ఎంపికైన హైదరాబాదీ స్విమ్మర్
Vritti Agarwal : ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడ(Asian Games 2023)లకు హైదరాబాదీ యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్(Vritti Agarwal) అర్హత సాధించింది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో చైనాలోని హాంగ్జూ (Hangzhou) వేదికగా జరుగనున్న ఏషియన్ గేమ్స కోసం జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య(National Swimming Federation) శనివారం జట్టును ప్రకటించింది. 36 మంది సభ్యులు గల ఈ జట్టులో...
Vritti Agarwal : ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడ(Asian Games 2023)లకు హైదరాబాదీ యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్(Vritti Agarwal) అర్హత సాధించింది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో చైనాలోని హాంగ్జూ (Hangzhou) వేదికగా జరుగనున్న ఏషియన్ గేమ్స కోసం జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య(National Swimming Federation) శనివారం జట్టును ప్రకటించింది. 36 మంది సభ్యులు గల ఈ జట్టులో తెలంగాణ యువ సంచలనం వ్రిత్తి చోటు దక్కించుకుంది.
ఇటీవలి కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న వ్రిత్తి.. తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి వేదికగా జరిగిన సీనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్(Senior Aquatic Championship)లోనూ రెండు పతకాలతో మెరిసిన విషయం తెలిసిందే. 12 మందితో కూడిన మహిళల బృందంలో వ్రిత్తి అగర్వాల్‌తో పాటు అనన్య నాయక్, మానా పటేల్, పాలక్ జోషి చోటు దక్కించుకున్నారు.
శ్రీహరి నటరాజన్‌తో పాటు
పురుషుల విభాగంలో స్టార్ స్విమ్మర్లు సజన్ ప్రకాశ్(Sajan Prakash), శ్రీహరి నటరాజన్(Srihari Natarajan)తో పాటు మాజీ కాంస్య పతక విజేత విర్ధ్వాల్ ఖడే జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2010 ఏషియన్ గేమ్స్‌లో ఖడే పురుషుల 50 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో కాంస్య పతకం సాధించాడు. మొత్తం 36 మందిని ఎంపిక చేయగా.. 21 మంది స్విమ్మింగ్‌లో, ముగ్గురు డైవింగ్‌లో, 13 మంది వాటర్పోలోలో ప్రాతినిధ్యం వహించనున్నారు. సీనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో నాలుగు జాతీయ రికార్డులు బద్దలు కొట్టిన టీనేజర్ అనీశ్ గౌడతో పాటు మరో యువ స్విమ్మర్ ఆర్యన్ నెహ్రా కూడా జాతీయ జట్టుకి ఎంపికయ్యారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

