హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్లో తెలంగాణ యువ సెయిలర్ వీవీ వైష్ణవి గెలుపు జోరు కొనసాగిస్తున్నది. పోటీల మూడో రోజైన శుక్రవారం జరిగిన నాలుగు రేసుల్లో వైష్ణవి మూడింట విజయాలు సాధించింది. బాలికల ఐఎల్సీఏ విభాగంలో బరిలోకి దిగిన వైష్ణవి..ఐదు, ఆరు, ఎనిమిది రేసుల్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకోగా, ఏడో రేసులో మూడో స్థానానికి పరిమితమైంది. మరోవైపు ఐఎల్సీఏ 6 ఓపెన్ విభాగంలో అద్వైత్ రెండు విజయాలు సాధించాడు.