భారత్ హెడ్ ఆఫ్ డెలిగేషన్గాహైదరాబాదీ షబ్బీర్ అలీ
భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్, హైదరాబాదీ షబ్బీర్ అలీకి అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) కీలక బాధ్యతలను అప్పగించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్, హైదరాబాదీ షబ్బీర్ అలీకి అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) కీలక బాధ్యతలను అప్పగించింది. మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా శుక్రవారం మొదలైన ఏఎఫ్సీ అండర్-17 క్వాలిఫయర్స్ టోర్నీలో పాల్గొంటున్న భారత జట్టు ఆయనను హెడ్ ఆఫ్ డెలిగేషన్గా నియమించింది. 1970, 80వ దశకాల్లో భారత్ తరఫున సుమారు 100 మ్యాచ్‌లు ఆడి 30 గోల్స్ సాధించిన 70 ఏండ్ల షబ్బీర్ మొహమ్మదన్ స్పోర్టింగ్, సల్గావ్కర్ వంటి ప్రముఖ క్లబ్‌లకు కోచ్‌గా పనిచేశాడు. 30 ఏండ్ల తర్వాత ఒక నూతన బాధ్యతలో మళ్లీ దేశానికి సేవ చేసే అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉందని షబ్బీర్ అన్నాడు. కాగా, ఈ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత్ గ్రూప్-ఈ లో ఆతిథ్య మలేషియా, పాలస్తీనా, సింగపూర్, గువామ్‌తో కలిసి బరిలోకి దిగుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

