హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ)లో ప్లేయర్ల చేరిక పర్వం కొనసాగుతున్నది. టైటిల్ నిలబెట్టుకోవాలని చూస్తున్న హెచ్ఎఫ్సీ అందుకు తగ్గట్లు ప్లేయర్లను ఎంపిక చేస్తున్నది.
యువ ఫుల్‌బ్యాక్ మనోజ్ మహమ్మద్‌ను కొత్తగా జట్టులోకి తీసుకున్నట్లు హెచ్ఎఫ్సీ యాజమాన్యం బుధవారం పేర్కొంది. ఈస్ట్‌బెంగాల్ క్లబ్‌తో తన ఫుట్‌బాల్ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన మనోజ్‌కు ఐ-లీగ్‌లో ఆడిన సుదీర్ఘ అనుభవముంది.