అండర్-19 ప్రపంచకప్‌లో అవినాశ్, అభిషేక్
భారత క్రికెట్ జట్టులో హైదరాబాద్ ప్రాతినిధ్యం అంతకంతకూ పెరుగుతున్నది. ఇప్పటికే మహమ్మద్ సిరాజ్, ఠాకూర్ తిలక్‌వర్మ టీమ్ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తుండగా తాజాగా జూనియర్ జట్టుకు అరవెల్లి అవినాశ్రావు, మురుగన్ అభిషేక్ ఎంపికయ్యారు.
- భారత జట్టుకు ఎంపికైన హైదరాబాద్ క్రికెటర్లు
ముంబై: భారత క్రికెట్ జట్టులో హైదరాబాద్ ప్రాతినిధ్యం అంతకంతకూ పెరుగుతున్నది. ఇప్పటికే మహమ్మద్ సిరాజ్, ఠాకూర్ తిలక్‌వర్మ టీమ్ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తుండగా తాజాగా జూనియర్ జట్టుకు అరవెల్లి అవినాశ్రావు, మురుగన్ అభిషేక్ ఎంపికయ్యారు.
దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే నెలలో మొదలయ్యే అండర్-19 ప్రపంచకప్ టోర్నీ కోసం సెలెక్టర్లు మంగళవారం భారత జూనియర్ జట్టును ఎంపిక చేశారు. ఇందులో హైదరాబాదీ క్రికెటర్లు అవినాశ్, అభిషేక్ ఉన్నారు. జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న వీరిద్దరి ప్రదర్శనను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో అండర్-19 ఆసియాకప్ ఆడుతున్న జట్టునే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన భారత జట్టుకు పంజాబ్ క్రికెటర్ ఉదయ్ సహ్రాన్ కెప్టెన్‌గా, స్వామికుమార్ పాండే వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మెగాటోర్నీ కంటే ముందు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌తో కలిసి యువ భారత్ ముక్కోణపు సిరీస్ ఆడనుంది. సఫారీ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో గ్రూపు-ఎలో బంగ్లాదేశ్, ఐర్లాండ్, యూఎస్ఏతో కలిసి భారత్ పోటీపడనుంది. తమ తొలి మ్యాచ్‌లో జనవరి 20న బంగ్లాదేశ్‌తో టీమ్ఇండియా తలపడుతుంది.
భారత అండర్-19 టీమ్: ఉదయ్ సహ్రాన్(కెప్టెన్), స్వామికుమార్(వైస్ కెప్టెన్), అవినాశ్రావు, ఇన్నేశ్ మహాజన్(వికెట్ కీపర్), అర్శిణ్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్రమయూర్, సచిన్ దాస్, ప్రియాంశు మోలి యా, ముషిర్ఖాన్, మురుగన్ అభిషేక్, ధనుశ్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారి. స్టాండ్‌బై: ప్రేవ్ దేవ్కర్, అన్ష్ గోసాయి, అమన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

