GT vs PBKS : పంతొమ్మిదో సీజన్లో రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్‌ను అహ్మదాబాద్‌లో తడబడింది. సుడిగాలిలా విరుచుకుపడే ఓపెనర్లకు గుజరాత్ టైటాన్స్ బౌలర్లు బ్రేకులు వేయగా మోస్తరు స్కోరే కొట్టింది. తొలి ఓవర్లోనే సిరాజ్(2-28) డబుల్ షాకివ్వగా.. జేసన్ హోల్డర్(4-24) చకచకా మిడిలార్డర్ పని పట్టాడు. 47కే ఐదు కీలక వికెట్లు పడిన వేళ అన్క్యాప్డ్ ప్లేయర్ సూర్యాన్ష్ షెడ్గే(57), మార్కస్ స్టోయినిస్(40)లు నిలబడ్డారు. గుజరాత్ బౌలింగ్ దళాన్ని కాచుకొని స్కోర్ 120 దాటించారు. ఈ జోడిని హోల్డర్ విడదీయడంతో పంజాబ్ 163కే పరిమితమైంది.
అహ్మదాబాద్‌లో టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. సిరాజ్ తొలి ఓవర్లోనే డబుల్ షాకిస్తూ ప్రియాన్ష్ ఆర్య(2)ను, ఆ తర్వాతి బంతికే డేంజరస్ కూపర్ కొన్నొల్లీ(0) వికెట్ సాధించాడు. రెండు కీలక వికెట్లు పడినా ప్రభ్‌సిమ్రన్ సింగ్(15) దూకుడు తగ్గించలేదు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(19)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పుతున్న అతడిని రబడ(2-22) ఔట్ చేసి పంజాబ్‌ను ఒత్తిడిలో పడేశాడు. కాసేపటికే నేహల్ వధేరా(0)ను డకౌట్ చేసిన హోల్డర్(4-24).. ఈ సీజన్లో అర్ధ శతకాలతో రెచ్చిపోతున్న అయ్యర్‌ను బౌల్డ్ చేసి గుజరాత్‌ను సంబురాల్లో ముంచెత్తాడు.
PBKS in recovery mode? 😲
🎥 The youngster Suryansh Shedge with three SIXES out of nowhere 👏👏
He also notches up his maiden #TATAIPL fifty, off only 24 balls 👌
Updates ▶️ https://t.co/9vBsQTIV2x#KhelBindaas | #GTvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/o5a4YvhEdv
— IndianPremierLeague (@IPL) May 3, 2026
పవర్ ప్లేలో గుజరాత్ పేసర్ల జోరుకు టపటపా ఐదు వికెట్లు పడడంతో స్టోయినిస్(40), సూర్యాన్ష్ షెడ్గే(57 : 29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు)లు జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్నారు. నిదానంగా ఆడిన ఇద్దరూ కుదురుకున్నాక వేగం పెంచి స్కోర్ దాటించారు. సిక్సర్లతో విరుచుకుడపిన షెడ్గే అర్ధ శతకంతో పంజాబ్‌ను గట్టెక్కించాడు.
📸 𝙁𝙧𝙖𝙢𝙚𝙨 𝙤𝙛 𝙖 𝙩𝙞𝙢𝙗𝙚𝙧 𝙨𝙩𝙧𝙞𝙠𝙚 \|/
Jason Holder absolutely enjoyed that one! 🔥
Updates ▶️ https://t.co/9vBsQTIV2x#TATAIPL | #KhelBindaas | #GTvPBKS pic.twitter.com/J6uFWSMOJr
— IndianPremierLeague (@IPL) May 3, 2026
అయితే.. దంచేస్తున్న షెడ్గేను, అనంతరం ఒకే ఓవర్లో స్టోయినిస్, బార్ట్లెట్ను ఔట్ చేసి పంజాబ్‌ను మళ్లీ దెబ్బకొట్టాడు హోల్డర్. అయితే.. రషీద్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో యాన్సెన్(20) సిక్సర్ బాదినా గిల్ డైవింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ ఓవర్లో 14 రన్స్ రావడంతో 9 వికెట్ల నష్టానికి పంజాబ్ 163 పరుగులు చేయగలిగింది.