బాకు: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సంచలన విజయం సాధించాడు. ఫిడే ప్రపంచకప్ టోర్నీలో శుక్రవారం జరిగిన పోరులో ప్రజ్ఞానంద..రెండో సీడ్ హికారు నకామురకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. ఆసక్తికరంగా సాగిన రెండు ర్యాపిడ్ గేముల్లోనూ ఈ యువ జీఎం అద్భుత ప్రతిభ కనబరిచాడు.
మరోవైపు విదిత్ గుజరాతి, ఇరిగేసి అర్జున్..ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించగా, నిహాల్ సరీన్ నిష్క్రమించాడు. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక ముందంజ వేయగా, హంపి పోరాటం ముగిసింది.