West Indies : వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ బెర్తు లక్ష్యంగా పెట్టుకున్న వెస్టిండీస్(West Indies) సొంతగడ్డపై వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ కోసం సెలెక్టర్లు షాయ్ హోప్(Shai Hope) సారథిగా 15 మందితో కూడిన పటిష్టమైన బృందాన్ని ఎంపిక చేశారు. సీనియర్లు రోస్టన్ ఛేజ్, జైడన్ సీల్స్, యువ పేసర్ షమర్ జోసెఫ్‌లను సెలెక్టర్లు తీసుకున్నారు. ఐపీఎల్ 19వ సీజన్లో తేలిపోయిన హిట్మైర్, రూథర్ఫొర్డ్లకు స్క్వాడ్‌లో చోటు దక్కింది.
ప్రపంచకప్ బెర్తు సాధించాలనే పట్టుదలతో ఉన్న వెస్టిండీస్ జట్టు స్వదేశంలో శ్రీలంకను ఢీ కొట్టనుంది. జూన్ 3వ తేదీ నుంచి ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగనుంది. దాంతో, సోమవారం సెలెక్టర్లు 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. టాపార్డర్‌లో అగస్టే, క్యాంప్‌బెల్, కేసీ కార్టీ ఎంపికయ్యారు. నిరుడు జూన్‌లో చివరి వన్డే ఆడిన హెట్‌మైర్, రూథర్‌ఫోర్డ్‌లు మిడిలార్డర్లో ఆడనున్నారు. గాయాల నుంచి కోలుకున్న అల్జారీ జోసెఫ్, గుడకేశ్ మోతీ, షమర్ జోసెఫ్, జైడన్ సీల్స్‌తో బౌలింగ్ దళం దుర్భేద్యంగా ఉంది.
The West Indies ODI Squad vs Sri Lanka is IN!💥
WI Outside at Sabina Park🇯🇲 in just 3️⃣days!⌚
For Tickets🎫and more info, check out 🔗https://t.co/6TUKc2hD7J #WIOutside #WIvSRI pic.twitter.com/Ww4rhGunRk
— Windies Cricket (@windiescricket) May 31, 2026
స్క్వాడ్ ఎంపిక అనంతరం ప్రధాన కోచ్ డారెన్ సమీ(Daren Sammy) మీడియాతో మాట్లాడుతూ.. వన్డే క్రికెట్లో మేము సొంతగడ్డపై బలీమయైన శక్తిగా ఎదగాలనుకుంటున్నాం. వ్యక్తిగత ఆటగాళ్ల ప్రదర్శన కంటే.. సమిష్టిగా జట్టు గెలవాలని నేను ఆశిస్తున్నా. గత 18 నెలలుగా మేము ఇదే విషయంపై దృష్టి పెడుతున్నాం అని పేర్కొన్నాడు.
వెస్టిండీస్ స్క్వాడ్ : షాయ్ హోప్(కెప్టెన్), అకీమ్ ఆగస్టే, జాన్ క్యాంప్‌బెల్, కేసీ కార్టీ, రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫోర్డే, జస్టిన్ గ్రీవ్స్, షిమ్రన్ హిట్మైర్, అమిర్ జన్గూ, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, గుడకేశ్ మోతీ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, జైడెన్ సీల్స్, షమర్ స్ప్రింగర్.