Shimron Hetmyer : విధ్వంసక క్రికెటర్ షిమ్రన్ హిట్మైర్(Shimron Hetmyer) కల ఫలించింది. వన్డేల్లో అవకాశం కోసం ఏడాదికిపైగా ఎదురుచూస్తున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ వెస్టిండీస్ స్క్వాడ్‌లోకి వచ్చేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో గాయపడిన జస్టిన్ గ్రీవ్స్(Justin Greaves) స్థానంలో ఈ చిచ్చరపిడుగును ఎంపిక చేశారు. తొలి మ్యాచ్‌లో వెన్ను గాయంతో బాధపడిన గ్రీవ్స్.. తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దాంతో, దూకుడుగా ఆడగల హిట్‌మైర్‌కు అతడి బదులు తీసుకున్నారు.
వెస్టిండీస్ బ్యాటింగ్ యూనిట్లో కీలకమైన షిమ్రన్ హిట్మైర్ నిరుడు జూన్‌లో చివరిసారి వన్డే జెర్సీ ధరించాడు.శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపికైనప్పటికీ అతడికి తుదిజట్టులో అవకాశం రాలేదు. ఈసారి న్యూజిలాండ్‌తో వన్డేల కోసం సంప్రదించగా మేజర్ లీగ్ క్రికెట్(MLC)లో ఆడుతున్నట్టు చెప్పాడు. అయితే.. అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న సియాటెల్ ఒర్కాస్(Seattle Orcas) జట్టు ఐదో స్థానంతో.. నాకౌట్‌కు అర్హత సాధించలేదు. దాంతో.. ఖాళీగానే ఉన్న హెట్మైర్ను గాయపడిన గ్రేవ్స్ స్థానంలో స్క్వాడ్‌లోకి తీసుకున్నారు సెలెక్టర్లు.
Shimron Hetmyer has replaced the injured Justin Greaves in West Indies’ squad for the second and third ODIs against New Zealand https://t.co/KESyRtKM6S pic.twitter.com/a7zm23InBg
— Cricinfo (@cricinfo) July 13, 2026
వెస్టిండీస్ స్క్వాడ్ (తొలి మూడు వన్డేలకు) : షాయ్ హోప్(కెప్టెన్), అకీమ్ ఆగస్టే, జాన్ క్యాంప్‌బెల్, కేసీ కార్టీ, రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫోర్డే, షిమ్రన్ హిట్మైర్, అమిర్ జన్గూ, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, విటెల్ లావెస్, గుడకేశ్ మోతీ, కీమో పాల్, రూథర్‌ఫోర్డ్, జైడెన్ సీల్స్.