ENG vs NZ : సొంత గడ్డపై ఇంగ్లండ్(England)కు ఘోర పరాభవం ఎదురైంది. లార్డ్స్‌లో ఘన విజయంతో జోరుమీదున్న ఆ జట్టుకు న్యూజిలాండ్(Newzealand) బిగ్ షాకిచ్చింది. కెన్నింగ్టన్ ఓవల్‌లో మ్యాట్ హెన్రీ (5-80-6-29) పేస్ ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు తోకముడిచారు. తొలి ఇన్నింగ్స్‌లోనే దెబ్బకొట్టిన హెన్రీ రెండో ఇన్నింగ్స్‌లోనూ చెలరేగడంతో ఆతిథ్య జట్టు చతికిలపడింది. జో రూట్(77) పోరాడినా.. జోర్డాన్ కాక్స్ చివరి వికెట్‌గా వెనుదిరిగడంతో 253 పరుగుల తేడాతో గెలుపొందిన కివీస్ 1-1తో సిరీస్ సమం చేసింది.
కెన్నింగ్టన్ ఓవల్‌లో న్యూజిలాండ్ పంజా విసిరింది. లార్డ్స్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంటూ ఇంగ్లండ్‌పై భారీ విజయంతో సిరీస్‌లో నిలిచింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆతిథ్య జట్టును కూల్చిన మ్యాట్ హెన్రీ కివీస్‌కు చిరస్మరణీయ విక్టరీ అందించాడు. అంతేకాదు దివంగత షేన్ వార్న్ అనంతరం ఓవల్‌లో పది వికెట్లు తీసిన బౌలర్‌గా ఈ పొడగరి పేసర్ రికార్డుకెక్కాడు.
New Zealand draw level at The Oval 💪
Matt Henry took just 50 minutes on the final morning to take the last five wickets 😳 pic.twitter.com/tYVtDJD96h
— ESPNcricinfo (@ESPNcricinfo) June 21, 2026
సుదీర్ఘ ఫార్మాట్లో నిలకడ తప్పితే ఓటమి ఖాయం అని ఇంగ్లండ్ నిరూపించింది. రెండో టెస్టులో న్యూజిలాండ్‌కు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్(100) శతకంతో భారీ స్కోర్ కొట్టిన న్యూజిలాండ్.. మ్యాట్ హెన్రీ(5-80) విజృంభణతో ఇంగ్లండ్‌ను 291 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో హెన్రీ నికోలస్(121) సెంచరీతో కదం తొక్కగా కివీస్ 362 పరుగులతో ఆతిథ్య జట్టుకు సవాల్ విసిరింది.
Joe Root is gone… and with him, England’s hopes? 👀 pic.twitter.com/MCzFp2S63T
— ESPNcricinfo (@ESPNcricinfo) June 21, 2026
భారీ ఛేదనలో హెన్రీ(6-29) చెలరేగడంతో రూట్ సేన తట్టుకోలేకపోయింది. జట్టును ఆదుకునేందుకు హ్యారీ బ్రూక్(58), రూట్ ఎంత ప్రయత్నించినా.. మిగతావారు నిలబడలేదు. ఫలితంగా.. ఇంగ్లండ్‌కు 253 పరుగల ఓటమి తప్పలేదు. నిర్ణయాత్మకమైన మూడో టెస్టు జూన్ 25న నాటింగ్హమ్లో జరుగనుంది.