దుబాయ్: అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించినందుకు జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్స్ట్రిక్పై ఐసీసీ ఎనిమిదేండ్ల పాటు నిషేధం విధించింది. 2017,18లలో కోచ్‌గా వ్యవహరించిన స్ట్రీక్..బుకీలతో సంప్రదింపులు జరుపుతూ ఐసీసీ నిబంధనలను ఐదుసార్లు అతిక్రమించినట్లు తేలింది. ‘అవినీతికి సంబంధించిన అంశాలపై స్ట్రీక్‌కు మెరుగైన అవగాహన ఉంది. అవినీతిని నిరోధించేందుకు ఉద్దేశించిన సెషన్లకు హాజరైన అతను ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు’ అని ఐసీసీ ఇంటిగ్రిటీ యూనిట్ జీఎం అలెక్స్ మార్షల్ పేర్కొన్నాడు.