MI vs UPW | హాఫ్ సెంచరీలతో చెలరేగిన హేలీ, మెక్‌గ్రాత్.. ముంబై టార్గెట్ 160
WPL 2023 : ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో కీలక పోరులో యూపీ వారియర్స్ (UP Warriorz) 159 పరుగులు చేసింది. ఓపెనర్ అలిసా హేలీ (58), తహ్లియా మెక్‌గ్రాత్ (50) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీళ్ల జోరు చూస్తుంటే యూపీ 200 ప్లస్ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ, ముంబై స్పిన్నర్ సాయిక్ ఇషాక్ కీలక వికెట్లు తీసి యూపీని దెబ్బ కొట్టింది.
MI vs UPW : ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో కీలక పోరులో యూపీ వారియర్స్ (UP Warriorz) 159 పరుగులు చేసింది. ఓపెనర్ అలిసా హేలీ (58), తహ్లియా మెక్‌గ్రాత్ (50) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీళ్ల జోరు చూస్తుంటే యూపీ 200 ప్లస్ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ, ముంబై స్పిన్నర్ సాయిక్ ఇషాక్ కీలక వికెట్లు తీసి యూపీని దెబ్బ కొట్టింది.
యూపీ బ్యాటర్లలో కిరణ్ నవ్గరే (17) మరోసారి నిరాశ పరిచింది. చివర్లో సిమ్రాన్ షేక్ (9), దీప్తి శర్మ (7) పోరాడడంతో యూపీ 150 ప్లస్ స్కోర్ చేయగలిగింది. ముంబై బౌలర్లలో సాయిక్ ఇషాక్ మూడు, హేలీ మాథ్యూస్ రెండు వికెట్లు తీశారు. అమేలియా కేర్ ఒక వికెట్ పడగొట్టింది.
నాలుగు బౌండరీలు
గత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై (96 నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ హేలీ ముంబైపై చెలరేగింది. మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. సాయిక్ వేసిన నాలుగో ఓవర్లో హేలీ రెచ్చిపోయింది. నాలుగు బౌండరీలు కొట్టింది. దాంతో, ఆ ఓవర్లో 18 రన్స్ వచ్చాయి. ఈ లీగ్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ కొట్టింది. తహ్లియా మెక్‌గ్రాత్ (50) తో కలిసి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించింది. మూడో వికెట్‌కు వీళ్లు 61బంతుల్లో 82 రన్స్ చేశారు.
ఇషాక్ మ్యాజిక్
హేలీ, మెక్‌గ్రాత్ బౌండరీలతో విరుచుకుపడుతుండడంతో హర్మన్‌ప్రీత్ బౌలింగ్ ఛేంజ్ చేసింది. బంతి అందుకున్న ఇషాక్ ఒకే ఓవర్లో రెండు పెద్ద వికెట్లు తీసింది. 17వ ఓవర్ మూడో బంతికి ఓపెనర్ హేలీ (58) ఎల్బీగా ఔట్ అయింది. ఐదో బంతికి తహ్లియా మెక్‌గ్రాత్ (50)ను యస్తికా భాటియా స్టంపౌట్ చేసింది. దాంతో, 141 వద్ద ఆ జట్టు నాలుగు వికట్లు పడ్డాయి. తొలి బంతికి సింగిల్ తీసి మెక్‌గ్రాత్ అర్ధ శతకం పూర్తి చేసుకుంది. 36 బంతుల్లో 9 ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించింది. ఓ కిరణ్ నవ్గరే(17) రెండో వికెట్‌గా వెనుదిరిగింది. ఎనిమిది పరుగుల వద్ద ఓపెనర్ దేవికా వైద్య(6)ను ఇషాక్ ఎల్బీగా ఔట్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

