Australia | ఆస్ట్రేలియాను వేధిస్తున్న గాయాలు.. వరల్డ్‌కప్ తొలి దశకు హేజిల్‌వుడ్ దూరం..!
Australia : టీ20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందే మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా(Australia)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మెగా టోర్నీ సన్నాహక సిరీస్‌లో పాకిస్థాన్ ధాటికి వైట్‌వాష్‌కు గురైన ఆసీస్‌కు ఇప్పుడు బౌలింగ్ కష్టాలు ఎదుర్కోనుంది.
Australia : టీ20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందే మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా(Australia)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మెగా టోర్నీ సన్నాహక సిరీస్‌లో పాకిస్థాన్ ధాటికి వైట్‌వాష్‌కు గురైన ఆసీస్‌కు ఇప్పుడు బౌలింగ్ కష్టాలు ఎదుర్కోనుంది. ఇప్పటికే ప్యాట్ కమిన్స్ (Pat Cummins) వెన్ను గాయంతో ఈవెంట్‌కు దూరమవ్వగా.. ప్రధాన పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood) సేవల్ని సైతం ఆ జట్టు కోల్పోనుంది. గాయం కారణంగా వరల్డ్‌కప్ తొలి దశ మ్యాచ్‌లకు ఈ స్పీడ్‌స్టర్ అందుబాటులో ఉండడం లేదు.
ఐసీసీ ఈవెంట్లలో ఫేవరెట్‌గా బరిలోకి దిగే ఆస్ట్రేలియా ఈసారి మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించడం లేదు. నిరుడు స్వదేశంలో భారత జట్టు చేతిలో పొట్టి సిరీస్ కోల్పోయిన కంగారు జట్టు.. సన్నాహక సిరీస్‌లో పాకిస్థాన్ దెబ్బకు కుదేలైంది. పైగా.. మెగా టోర్నీకి ముందే మిచెల్ మార్ష్ సేనకు గాయాలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధాన పేసరైన హేజిల్‌వుడ్ అచిల్లెస్ గాయంతో వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. హేజిల్‌వుడ్ వచ్చేంత లోపు సియాన్ అబాట్‌ను ట్రావెల్ రిజర్వ్‌గా స్క్వాడ్‌లోకి తీసుకున్నారు సెలెక్టర్లు.
Australia squad updates: Sean Abbott will remain with Australia’s squad following the Pakistan tour as fast-bowling cover for the T20 World Cup.
Josh Hazlewood will continue his rehab in Sydney during the early part of the tournament before travelling to Sri Lanka pic.twitter.com/2IXVRdaWnW
— ESPNcricinfo (@ESPNcricinfo) February 2, 2026
ఈమధ్యే బిగ్‌బాష్ లీగ్‌లో తొడ కండరాల గాయంతో బాధపడిన హిట్టర్ టిమ్ డేవిడ్, లెఫ్టార్మ్ పేసర్ నాథన్ ఎల్లిస్ స్క్వాడ్‌తో కలిసినా.. వారిద్దరికీ మ్యాచ్ ప్రాక్టీస్ మాత్రం లేదు. ఈసారి ఆస్ట్రేలియా బ్యాటింగ్ భారం కెప్టెన్ మార్ష్‌తో కలిసి కుర్రాళ్లు కూపర్, హెడ్, రెన్షా తీసుకోనున్నారు. ఎప్పుడు ఎలా ఆడుతాడో తెలియని మ్యాక్స్‌వెల్ చెలరేగిన రోజున ఆ జట్టు గెలుపు ఖాయం. పేస్ ఆల్‌రౌండర్లు కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్‌ల అనుభవం ఆసీస్‌కు కొండంత బలం కానుంది. ఇక బౌలింగ్ యూనిట్లో ఎల్లిస్, బార్ట్లెట్, ఆడం జంపాలు కీలకం కానున్నారు. ఫిబ్రవరి 11వ తేదీన ఐర్లాండ్‌లో తలపడనుంది.
ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ స్క్వాడ్ : మిచెల్ మార్ష్(కెప్టెన్), గ్జావియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నొలీ, టిమ్ డేవిడ్, బెన్ ద్వారుషీ, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మ్యాట్ కుహ్నేమన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మ్యాట్ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడం జంపా, సియాన్ అబాట్(ట్రావెలింగ్ రిజర్వ్).
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

