RR vs RCB : వర్షం కారణంగా టాస్ ఆలస్యమైన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్.. ప్రత్యర్థి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెక్ పెట్టాలనుకుంటోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ పేస్ అస్త్రం జాకబ్ డఫ్ఫీ ఆడడం లేదు. అతడి స్థానంలో జోష్ హేజిల్‌వుడ్ జట్టులోకి వచ్చాడని కెప్టెన్ రజత్ పాటిదార్ తెలిపాడు.
గువాహటిలో వర్షం కురవడంతో రాత్రి 7:00 గంటలకు వేయాల్సిన టాస్ వాయిదా పడింది. వరుణుడు శాంతించడంతో 7:38 గంటలకు టాస్ వేయగా.. రియాన్ పరాగ్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే.. టాస్ పడిన కాసేపటికే మళ్లీ చిన్నగా వాన మొదలైంది. దాంతో, సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పేశారు. ఆట మొదలవ్వడం కాస్త ఆసల్యం అయ్యేలా ఉంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఇంప్యాక్ట్ సబ్‌గా ఆడే అవకాశముంది.
🚨 Toss 🚨@rajasthanroyals won the toss and elected to bowl first against @rcbtweets in Guwahati
Updates ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB pic.twitter.com/AedOJ49GvX
— IndianPremierLeague (@IPL) April 10, 2026
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియన్ పరాగ్(కెప్టెన్), హిట్మైర్, ఫెరీరా, జడేజా, ఆర్చర్, బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్.
ఇంప్యాక్ట్ సబ్స్ – వైభవ్ సూర్యవంశీ, ప్రిటోరియస్, రవి సింగ్, శుభమ్ దూబే, తుషార్ దేశ్‌పాండే.
ఆర్సీబీ తుది జట్టు : విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, అభినందన్ సింగ్, హేజిల్‌వుడ్.
ఇంప్యాక్ట్ సబ్స్ – సుయాశ్ శర్మ, జాకబ్ బెథెల్, రసిక్ సలాం, కనిశ్క్ చౌహన్, వెంకటేశ్ అయ్యర్.