Ranchi ODI | రానాకు మూడో వికెట్.. సగం బ్యాటర్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా..!
Ranchi ODI : భారత్ నిర్ధేశించిన భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా తడబడుతోంది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీలను హర్షిత్ రానా (3-35) మరింత దెబ్బకొట్టాడు.
Ranchi ODI : భారత్ నిర్ధేశించిన భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా తడబడుతోంది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీలను హర్షిత్ రానా (3-35) మరింత దెబ్బకొట్టాడు. బౌండరీలతో విరుచుకుపడుతున్న డెవాల్డ్ బ్రెవిస్(37) అతడి ఓవర్లో వెనుదిరిగాడు. సిక్సర్‌కు యత్నించిన బ్రెవిస్ బౌండరీ వద్ద రుతురాజ్ గైక్వాడ్ చేతికి దొరికిపోయాడు. బ్రెవిస్ వికెట్‌తో 130కే సగం మందిని కోల్పోయింది సఫారీ టీమ్.
రాంచీ వన్డేలో భారీ ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే భారత పేసర్ హర్షిత్ రానా(2-2) దిమ్మతిరిగే షాకిచ్చాడు. తన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ తీశాడు. రెండో ఓవర్ వేసిన అతడు తొలి బంతికే ఓపెనర్ రియాన్ రికెల్టన్(0)ను బౌల్డ్ చేసిన రానా.. నాలుగో బంతికి క్వింటన్ డికాక్(0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. అంతే.. 7 పరుగులకే సఫారీ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒత్తిడికి లోనైన కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్(7) సైతం అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లో రాహుల్ చేతికి దొరికిపోయాడు. ఆ తర్వాత మాథ్యూ బ్రీట్జ్(54 నాటౌట్)తో టోనీ డి జోర్జి(39) కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు.
Fantastic Review 👏
Kuldeep Yadav strikes as #TeamIndia have wicket no.4⃣ ☝️
Updates ▶️ https://t.co/MdXtGgQMZQ#INDvSA | @IDFCFIRSTBank | @imkuldeep18 pic.twitter.com/kTsuy4p15O
— BCCI (@BCCI) November 30, 2025
క్రీజులో కుదురుకున్నాక బౌండరీలతో స్కోర్ బోర్డును ఉరికించిన ఈ ద్వయాన్ని కుల్దీప్ విడదీశాడు. నాలుగో వికెట్ తీసిన భారత బౌలర్ల సంబురాన్ని డెవాల్డ్ బ్రెవిస్(37) నీరుగార్చుతూ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జడేజా ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన అతడు ఆ తర్వాత రానా ఓవర్లో పెద్ద షాట్ ఆడి గైక్వాడ్ చేతికి చిక్కాడు. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో ఒంటిచేత్తో డైవింగ్ క్యాచ్ పట్టి గైక్వాడ్‌ను పెవిలియన్ పంపిన ఈ సఫారీ కుర్రాడు.. ఇప్పుడు అతడి చేతికే చిక్కడం విశేషం. ప్రస్తుతం మాథ్యూ బ్రీట్జ్(54), మార్కో జాన్సెన్(9) క్రీజులో ఉన్నారు. 24 ఓవర్లకు స్కోర్.. 147-5.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

