Hardik Pandya | ఐర్లాండ్ బ్యాటర్‌కు బ్యాట్ గిఫ్ట్ ఇచ్చిన పాండ్యా.. ఐపీఎల్ ఆడితే బాగుంటుందని కితాబు!
ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలోనే కీలకమైన వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్‌ను యువ ఆటగాడు హ్యారీ టెక్టార్ ఆదుకున్నాడు. అద్భుతంగా ఇన్నింగ్స్ నిర్మించిన అతను.. 33 బంతుల్లో 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా యువసారధి హార్దిక్ పాండ్యా కూడా హ్యారీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘హ్యారీ అద్భుతమైన షాట్స్ ఆడాడు. తన వయసు ఇంకా 22 సంవత్సరాలే. నా బ్యాట్ కూడా అతనికి గిఫ్ట్‌గా ఇచ్చా. తను ఇంకొన్ని సిక్సర్లు కొట్టాలని, ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందుతాడని ఆశిస్తున్నా’’ అని హార్దిక్ చెప్పాడు.
ఐర్లాండ్ మేనేజ్మెంట్ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటే అద్భుతంగా రాణిస్తాడని, ఐపీఎల్ ఒక్కటే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరిగే టీ20 లీగులు అన్నింట్లో రాణిస్తాడని హ్యారీకి కితాబిచ్చాడు. టీమిండియా సారధిగా ఈ మ్యాచ్‌లో పాండ్యా అద్భుతంగా రాణించాడు. బౌలింగ్‌లో ఒక వికెట్ తీసిన అతను.. బ్యాటింగ్‌లో కూడా అదరగొట్టాడు. కేవలం 12 బంతుల్లోనే 24 పరుగులతో రాణించాడు. అంతేకాదు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో వికెట్ తీసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు కూడా తన పేరిట రాసుకున్నాడు.
🎥 That moment when @hardikpandya7 revealed his conversations with Ireland's Harry Tector while handing over a bat after the first #IREvIND T20I. 👍 👍#TeamIndia pic.twitter.com/fB4IG6xHXN
— BCCI (@BCCI) June 27, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

