IPL 2024 | ముంబై క్యాంప్‌లో పాండ్యా.. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రత్యేక పూజ.. వీడియో
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌కు ఇంకా 10 రోజులే ఉంది. దాంతో, ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) జట్టుతో కలిశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో అతడికి హెడ్‌కోచ్ మార్క్ బౌచర్(Mark Boucher) స్వాగతం పలికాడు. అనంతరం పాండ్యా తన గదిలో...
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌కు ఇంకా 10 రోజులే ఉంది. దాంతో, ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) జట్టుతో కలిశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో అతడికి హెడ్‌కోచ్ మార్క్ బౌచర్(Mark Boucher) స్వాగతం పలికాడు. అనంతరం పాండ్యా తన గదిలో చిన్నపాటి పూజా మందిరం ఏర్పాటు చేసుకున్నాడు. రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న పాండ్యా ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడాలని దేవుడికి ప్రత్యేక పూజలు చేశాడు. బౌచర్ సైతం కొబ్బరి కాయ కొట్టి ముంబై విజయాన్ని కాంక్షిస్తూ ప్రార్ధనలు చేశాడు. ఆ వీడియోను ముంబై ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
వరల్డ్ కప్‌లో గాయంతో కొన్ని నెలలు ఆటకు దూరమైన పాండ్యా ఈమధ్యే ఫిట్నెస్ సాధించాడు. బరోడా స్టేడియంలో అన్న కృనాల్ పాండ్యా, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌తో కలిసి బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. టీ20 కెప్టెన్‌గా విజయవంతమైన పాండ్యా భావి కెప్టెన్‌గా ఎదిగాడు.
चला सुरु करूया 🙏🥥#OneFamily #MumbaiIndians @hardikpandya7 pic.twitter.com/XBs5eJFdfS
— Mumbai Indians (@mipaltan) March 11, 2024
ఫ్యాన్స్‌కు నచ్చలే..
దాంతో, ఐపీఎల్ 17వ సీజన్ వేలానికి ముందు ముంబై యాజమాన్యం అతడికి గుజరాత్ నుంచి ట్రేడ్ పద్ధతిలో కొన్నది. అంతేనా రోహిత్ స్థానంలో పాండ్యాను సారథిగా ప్రకటించింది. అయితే.. ఐదు ట్రోఫీలు కట్టబెట్టిన హిట్‌మ్యాన్‌ను సారథిగా తప్పించడం ముంబై ఫ్యాన్స్‌కు నచ్చలేదు. దాంతో, సోషల్‌మీడియాలో పాండ్యాపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ, ముంబై మేనేజ్మెంట్ మాత్రం ఈ ఆల్‌రౌండర్‌కు అన్నివిధాలా మద్దతుగా నిలిచింది.

ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22న షురూ కానుంది. ఈ సీజన్లో ముంబై తొలి పోరులో ఫిబ్రవరి 24న గుజరాత్ టైటాన్స్ జట్టుతో తలపడనుంది. నిరుడు ప్లే ఆఫ్స్‌లోనే వెనుదిరిగిన ముంబై ఈ ఎడిషన్‌లో టైటిల్ కొట్టాలనే కసితో ఉంది. అరంగేట్రంలోనే గుజరాత్‌ను విజేతగా నిలిపిన పాండ్యా.. ముంబై ఆశల్ని నిజం చేస్తాడా? లేదా? మరికొన్ని రోజుల్లో తెలియనుంది.
ఇవి కూడా చదవండి
- Congress | లోక్‌సభ ఎన్నికలు.. పోటీ నుంచి తప్పుకుంటున్న కాంగ్రెస్ వెటరన్స్
- CAA | సీఏఏకు వ్యతిరేకంగా నేడు రాష్ట్రవ్యాప్త బంద్.. సీఎం హెచ్చరించినా తగ్గేది లేదన్న పార్టీలు
- Woman Attack | చేతి కర్రతో మామను చితకబాదిన కోడలు.. కూతురి ఫిర్యాదుతో కేసు నమోదు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

