సౌతాంప్టన్: హార్డ్ హిట్టర్ లివింగ్‌స్టోన్ (95 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో ఇంగ్లండ్ 79 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 34 ఓవర్ల మ్యాచ్ నిర్వహించగా.. మొదట ఇంగ్లండ్ 226/7 స్కోరు చేసింది.
బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 26.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. మిషెల్ (57) టాప్ స్కోరర్ కాగా.. విల్లే, టాప్లీ మూడేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.