Harbhajan Singh: ఇదేందయా ఇది..! రెండు ఛానెళ్లలో ఒకేసారి లైవ్.. భజ్జీకి అతీత శక్తులున్నాయా?
Harbhajan Singh: ఒకేసారి రెండు ఛానెళ్లేంటి..? పది ఛానెళ్లలో కూడా లైవ్ రావొచ్చు కదా..? అనే కదా మీ డౌటానుమానం. ఒకే వ్యక్తి ఒక అంశంపై మాట్లాడుతున్నప్పుడు ఎన్ని ఛానెళ్లలో అయినా లైవ్ రావొచ్చు. కానీ ఒకే వ్యక్తి రెండు వేర్వేరు అంశాలపై మాట్లాడుతూ ఒకేసారి లైవ్ రావడం అనేది మాత్రం ‘నెవ్వర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్’ వంటిదే.
Harbhajan Singh: టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు ఏమైనా అతీత శక్తులున్నాయా..? లేక అతడిని పోలిన వ్యక్తి మరొకరు ఉన్నారా..? ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియోను చూస్తే ఇదే అనుమానం రాక మానదు. ఎందుకంటే భజ్జీ ఒకేసారి రెండు ఛానెళ్లలోనూ లైవ్‌లో కనబడుతూ అందరికీ షాకిచ్చాడు. అదేంటి..? ఒకేసారి రెండు ఛానెళ్లేంటి..? పది ఛానెళ్లలో కూడా లైవ్ రావొచ్చు కదా..? అనే కదా మీ డౌటానుమానం. ఒకే వ్యక్తి ఒక అంశంపై మాట్లాడుతున్నప్పుడు ఎన్ని ఛానెళ్లలో అయినా లైవ్ రావొచ్చు. కానీ ఒకే వ్యక్తి రెండు వేర్వేరు అంశాలపై మాట్లాడుతూ ఒకేసారి లైవ్ రావడం అనేది మాత్రం ‘నెవ్వర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్’ వంటిదే.
వివరాల్లోకెళ్తే వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా ఈ టోర్నీ అధికారిక ప్రసారదారు అయిన స్టార్ స్పోర్ట్స్‌లో హర్భజన్.. మధ్యాహ్నం ఒంటిగంటకు తుది పోరుకు సంబంధించిన ప్రీ మ్యాచ్ విశ్లేషణ చెబుతూ కనిపించాడు. అదే సమయంలో ‘ఆజ్ తక్’లో కూడా ఈ టర్బోనేటర్ మ్యాచ్‌పై తన వ్యూస్‌ను పంచుకున్నాడు. రెండు వేర్వేరు ఛానెళ్లలో వేర్వేరు అంశాలపై ఒకేసారి భజ్జీ కనిపించడంతో అవాక్కవడం అభిమానుల వంతైంది.
Antaryami he woh
Har jagah reh saktha he— Being Indian 🇮🇳 (@SunilSa02606284) November 17, 2023
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టంట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘భజ్జీ సర్వంతర్యామి.. అతడు ఒకే సమయంలో ఎక్కడైనా ఉండగలడు’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు.. స్టార్ స్పోర్ట్స్‌లో వచ్చింది రికార్డెడ్ ప్రోగ్రామ్ అని.. కానీ దానిని వాళ్లు లైవ్‌గా పెట్టుకుని హల్చల్ చేసినందువల్లే ఇలా ఒకే సమయంలో రెండు వేర్వేరు ఛానెళ్లలో భజ్జీ కనిపించాడని క్లారిటీ ఇస్తున్నారు. మరి దీనిపై టర్బోనేటర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. నవంబర్ 3 నుంచి మళ్లీ సెట్స్‌లోకి పాన్ ఇండియా స్టార్!
I’m Game OTT | ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

