బ్రిస్బేన్: న్యూజిలాండ్‌తో జరుగతున్న టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. 11 ఓవర్లలో ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 87 రన్స్ చేసింది. అయితే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన హేల్స్ 52 పరుగులకు ఔటయ్యాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగాయి. ఇంగ్లండ్ ఈ మ్యాచ్ పవర్‌ప్లేలో 48 రన్స్ చేసింది. హేల్స్ పవర్ఫుల్ షాట్లతో అలరిస్తున్నాడు. కానీ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఇంగ్లండ్ స్కోరింగ్ వేగాన్ని కివీస్ అడ్డుకుంటోంది. ప్రస్తుతం బట్లర్, అలీలు క్రీజ్‌లో ఉన్నారు.