హిమాయత్‌నగర్, జూన్ 4: మాస్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌కు తెలంగాణ హకీం ఎంపికయ్యాడు. ఈ నెల 21 నుంచి రష్యా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన హకీం 65 కేజీల విభాగంలో బరిలోకి దిగనున్నాడు. మెగాటోర్నీలో హకీం విజేతగా నిలిచి తెలంగాణకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆల్ ఇండియా ట్రెడిషనల్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (టీడబ్ల్యూఏటీ) ఉపాధ్యక్షుడు తంబోలి ఆకాంక్షించారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన హకీంను అభినందించారు. గతంలో నాలుగుసార్లు మాస్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్న హకీం జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడని తంబోలి వివరించారు. ఈ సమావేశంలో టీడబ్ల్యూఏటీ అధ్యక్షుడు హాఫీజ్, నాయకులు అదిల్, జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.