న్యూఢిల్లీ: భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్‌పై రెండేండ్ల నిషేధం పడింది. మార్చి నెల నుంచి కర్మాకర్ వివరాలు ఏమీ తెలియనందున, డోపింగ్ నిబంధనలకు ఇది విరుద్ధమైనందున కర్మాకర్‌పై నిషేధం విధించినట్టు అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య (ఎఫ్ఐజీ) వెబ్సైట్లో నిషేధం వివరాలు పొందుపరిచింది.
దీనిపై భారత జిమ్నాస్టిక్స్ సమా ఖ్య (జీఎఫ్ఐ), జాతీయ ఉత్ప్రేరకాల నిషేధ సంస్థ (నాడా), కర్మాకర్ పెదవి మెదపడంలేదు. ఎఫ్ఐజీ నిబంధనల ప్రకారం అథ్లెట్లందరూ ప్రతి ఆరు నెలలకు తాము ఎక్కడ ఉన్నది, ఏం చేస్తున్నది ప్రపంచ ఉత్ప్రేరక నిరోధక సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది.