Jos Buttler: కోహ్లీ, ధోనీని స్పూర్తిగా తీసుకున్నా: జోస్ బట్లర్
Jos Buttler: విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వారిని ప్రేరణగా తీసుకున్నట్లు జోస్ బట్లర్ తెలిపారు. సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఆ క్రికెటర్లకు ఉందని, వారిని ఆదర్శంగా తీసుకున్నట్లు బట్లర్ తెలిపాడు.
కోల్‌కతా: ఐపీఎల్లో అద్భుతాన్ని సృష్టించాడు జోస్ బట్లర్(Jos Buttler). కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్ తన సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. భారీ స్కోరును ఛేజ్ చేసి కోల్‌కతా చరిత్ర సృష్టించింది. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వారిని ప్రేరణగా తీసుకున్నట్లు జోస్ బట్లర్ తెలిపారు. సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఆ క్రికెటర్లకు ఉందని, వారిని ఆదర్శంగా తీసుకున్నట్లు బట్లర్ తెలిపాడు. రాజస్థాన్ బ్యాటర్ బట్లర్ 60 బంతుల్లో 107 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కోల్‌కతా రెండు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. విన్నింగ్స్ రన్స్‌ను బట్లర్ స్కోర్ చేశాడు.
ఇంగ్లీష్ బ్యాటర్ బట్లర్ ఓ దశలో నడవడానికి ఇబ్బందిపడ్డాడు. కానీ తనలోని పోరాట పటిమను అతను వదలలేదు. 224 రన్స్‌ను ఛేజింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 13వ ఓవర్లో 121 రన్స్‌కు ఆరు వికెట్లు కోల్పోయింది. కానీ నమ్మకంతో ఇన్నింగ్స్‌ను కొనసాగించినట్లు బట్లర్ చెప్పాడు. రిథమ్ కోసం కొంత తడబడ్డా.. తనకు తానే మళ్లీ నెమ్మదించుకున్నట్లు చెప్పాడు. రిథమ్ మళ్లీ రావాలంటే కొంత శాంతంగా ఉండాలని అనుకున్నట్లు చెప్పాడు.
ఐపీఎల్లో ఎన్నో అద్భుతాలు జరిగాయని, కొన్ని మ్యాచుల్లో క్రేజీగా ఫినిష్ అవుతోందని, ధోనీ.. కోహ్లీ లాంటి ఆటగాళ్లు చివరి వరకు ఆడుతారని, నమ్మకంతో బ్యాటింగ్ చేస్తారని, తాను కూడా అదే చేసేందుకు ప్రయత్నించినట్లు బట్లర్ తెలిపారు. కోచ్ కుమార సంగక్కరకు కూడా క్రెడిట్ ఇచ్చాడు బట్లర్. తనలో నమ్మకాన్ని పెంచేందుకు కోచ్ సంగక్కర ప్రయత్నించినట్లు బట్లర్ పేర్కొన్నాడు. సంగక్కర తనకు ఎంతో చెప్పాడని, ప్రతి దశలోనూ ఓ బ్రేకింగ్ పాయింట్ ఉంటుందని, వికెట్‌ను కోల్పోవద్దు అని సలహా ఇచ్చారని తెలిపాడు.
పిచ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేయాలని, ఏదో ఓ దశలో మూమెంటం మారుతుందని, గత కొన్నేళ్లలో తాను ఇదే నేర్చుకున్నట్లు సంగక్కర చెప్పారని బట్లర్ వెల్లడించాడు. మంగళవారం కోల్‌కతాతో ఆడిన మ్యాచ్ తన ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో ఉత్తమమైందని బట్లర్ పేర్కొన్నాడు. చాలా సంతృప్తిని ఇచ్చిందన్నాడు.
బట్లర్ ఓ ప్రత్యేకమైన ప్లేయర్ అని, అతను ఫామ్‌లో ఉంటే, ఏ టార్గెట్ కూడా సురక్షితం కాదు అని ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపారు. ఈ గెలుపుతో సంతోషంగా ఉందని, వికెట్లు కోల్పోతున్నసమయంలో ఆందోళన చెందామని, రోవ్మాన్ పావెల్ కొన్ని సిక్స్‌లు కొట్టాడని, ఆ సయమంలో మళ్లీ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు అనిపించిందని శాంసన్ తెలిపాడు.
Learning and getting inspired from the best 🙏#TATAIPL | #KKRvRR pic.twitter.com/JRBZN3xuot
— IndianPremierLeague (@IPL) April 16, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Dhoni
- IPL 2024
- jos buttler
- KKR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

