Gukesh | భారత్ చెస్ నంబర్‌వన్‌గా నయా స్టార్.. విశ్వనాథన్ ఆనంద్ స్థానాన్ని కైవసం చేసుకున్న గుకేశ్
చదరంగంలో గత 37 ఏండ్లుగా భారత నంబర్‌వన్ ఆటగాడిగా కొనసాగుతున్న చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ స్థానాన్ని యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ కైవసం చేసుకున్నాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న గుకేశ్ తాజా ర్యాంకింగ్స్‌లో 2758 ఎలో రేటింగ్ పాయింట్స్ ఖాతాలో వేసుకున్నాడు.
- భారత చెస్ నంబర్‌వన్‌గా నయా స్టార్
- ఆనంద్ ప్లేస్ దక్కించుకున్న గుకేశ్
Gukesh | చెన్నై: చదరంగంలో గత 37 ఏండ్లుగా భారత నంబర్‌వన్ ఆటగాడిగా కొనసాగుతున్న చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ స్థానాన్ని యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ కైవసం చేసుకున్నాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న గుకేశ్ తాజా ర్యాంకింగ్స్‌లో 2758 ఎలో రేటింగ్ పాయింట్స్ ఖాతాలో వేసుకున్నాడు.
1986 జూలై నుంచి భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్న ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ ఆనంద్ ప్రస్తుతం 2754 పాయింట్లతో దేశంలో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వీరిద్దరూ వరుసగా ఎనిమిది, తొమ్మిదో స్థానాలు దక్కించుకున్నారు. వరల్డ్ టాప్-10లోకి గుకేశ్ రావడం ఇదే తొలిసారి. ఫిడే చెస్ ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద (2727) 19వ ర్యాంక్‌లో ఉండగా.. విదిత్ సంతోష్ (27వ ర్యాంక్), అర్జున్ ఇరిగైసి (29వ ర్యాంక్) కూడా టాప్-30లో చోటు దక్కించుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

