DC vs GG : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), గుజరాత్ జెయింట్స్ (Gujrat Giants) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ స్నేహ్ రానా (Sneh Rana) బ్యాటింగ్ తీసుకుంది. డీవై పాటిల్ స్టేడియంలో ఇరు జట్లు ఎదురుపడనున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలిచిన గుజరాత్ విజయ పరంపరను కొనసాగించాలి అనుకుంటోంది. గత మ్యాచ్లో ముంబై చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావిస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : మేగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, లారా హ్యారిస్, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), మిన్నూ మన్సీ, శిఖా పాండే, తారా నోరిస్. రాధా యాదవ్.
గుజరాత్ జెయింట్స్ జట్టు : సబ్బినేని మేఘన, సోఫియా డంక్లే, హర్లీన్ డియోల్, అషే గార్డ్నర్, లారా వొల్వార్డ్త్, దయలాన్ హేమలత, స్నేహ్ రానా (కెప్టెన్), కిమ్ గార్త్, సుష్మా వర్మ (వికెట్ కీపర్), మన్సీ జోషి, జార్జియా వరేహం. తనుజా కన్వర్.