IPL 2023 | గుజరాత్, ముంబైలో ఫైనల్ చేరేదెవరో?.. నేడే ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్
IPL 2023 | లక్నోపై అద్వితీయ విజయంతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్.. చైన్నై చేతిలో పరాజయంతో ఇబ్బందుల్లో కనిపిస్తున్న గుజరాత్ టైటాన్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఐపీఎల్ 16వ సీజన్లో ఇప్పటికే చెన్నై ఫైనల్ చేరుకోగా.. మరో బెర్త్ కోసం ఇరు జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి.
IPL 2023 | లక్నోపై అద్వితీయ విజయంతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్.. చైన్నై చేతిలో పరాజయంతో ఇబ్బందుల్లో కనిపిస్తున్న గుజరాత్ టైటాన్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఐపీఎల్ 16వ సీజన్లో ఇప్పటికే చెన్నై ఫైనల్ చేరుకోగా.. మరో బెర్త్ కోసం ఇరు జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. లక్ష మందికి పైగా ప్రేక్షకులు హాజరుకానున్న ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానంలో మరి రోహిత్ సేన పైచేయి సాధిస్తుందా.. లేక డిఫెండింగ్ చాంపియన్ హార్దిక్ బృందం ముందంజ వేస్తుందా చూడాలి!
అహ్మదాబాద్: ఐపీఎల్లో ఐదు టైటిళ్లు నెగ్గి అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు సాధించిన ముంబై ఇండియన్స్ మరో కీలక పోరుకు రెడీ అయింది. లీగ్ దశలో ఇతర జట్ల ఫలితాల ఆధారంగా ముందడుగు వేసిన ముంబై.. లక్నోతో జరిగిన ఎలిమినేటర్‌లో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. అదే జోరులో శుక్రవారం జరుగనున్న క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. బలాబలాల పరంగా చూసుకుంటే ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో లీగ్ దశను ముగించిన హార్దిక్ సేన.. తొలి క్వాలిఫయర్‌లో చెన్నై చేతిలో ఓడిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్‌కు సొంతగడ్డపై ఆడనుండటం సానుకూలాంశం కాగా..
సీజన్ చివరి దశకు వస్తున్నా కొద్ది ముంబైకి మ్యాచ్ విన్నర్లు ఎక్కువవుతున్నారు. లీగ్ దశ చివర్లో కామెరూన్ గ్రీన్ బ్యాట్‌తో విశ్వరూపం కనబరుస్తుంటే.. బౌలింగ్‌లో ఆకాశ్ మధ్వాల్ రూపంలో ముంబైకి మరో హీరో దొరికాడు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డావిడ్, నేహల్ వధేరా రూపంలో ముంబై బ్యాటింగ్ శత్రుదుర్భేద్యంగా కనిపిస్తున్నది. గుజరాత్‌కు గిల్, సాహా, హార్దిక్, శంకర్, మిల్లర్, తెవాటియా, రషీద్‌ఖాన్ రూపంలో బలమైన సైన్యమే ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే.. ముంబై కంటే గుజరాత్ వైపే కాస్త మొగ్గు కనిపిస్తున్నది. సీజన్ ఆసాంతం నిలకడగా రాణిస్తున్న మహమ్మద్ షమీ, మోహిత్ శర్మతో పాటు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉండటం టైటాన్స్‌కు అదనపు బలం చేకూర్చనుంది. గత మ్యాచ్‌లో లక్నోపై 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన ముంబై పేసర్ ఆకాశ్ జోరుమీదున్నా.. అతడికి సహకరించే మరో దేశీ పేసర్ కనిపించడం లేదు.

గురు శిష్యుల పోరు..
కెరీర్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ తరఫునే ఆల్‌రౌండర్‌గా సత్తాచాటి జాతీయ జట్టుకు ఎంపికైన హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ కెప్టెన్సీలోనే రాటు దేలిన పాండ్యా.. అతడి వ్యూహాలను ఎలా అడ్డుకుంటాడనేది ఆసక్తికరం. గత మ్యాచ్‌లో ధోనీ సేన చేతిలో పరాజయం పాలైన టైటాన్స్.. వరుసగా రెండో సారి ఫైనల్ చేరాలని కృతనిశ్చయంతో ఉంటే.. రికార్డు స్థాయిలో ఆరో టైటిల్ పట్టాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతున్నది. గత రెండు మ్యాచ్‌లు జరిగిన చెన్నై పిచ్‌తో పోల్చుకుంటే.. అహ్మదాబాద్ పిచ్ పరుగులు చేయడం కాస్త సులువు కావచ్చు. వికెట్ పేస్‌కు సహకరించే సూచనలున్న నేపథ్యంలో ఇంపాక్ట్ ప్లేయర్ స్ట్రాటజీ కీలకం కానుంది. ఇరు జట్లలోనూ స్టార్ ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో పోరు హోరాహోరీగా సాగే అవకాశాలున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో జరుగనున్న పోరులో మరి ఎవరు స్టార్‌గా నిలుస్తారో చూడాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

