SRH | సన్‌రైజర్స్‌కు గుజరాత్ షాక్.. అహ్మదాబాద్‌లో తేలిపోయిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు
నాలుగు రోజుల క్రితం ఉప్పల్ వేదికగా ముంబైతో ముగిసిన మ్యాచ్‌లో దొరికినబంతిని దొరికినట్టు వీరబాదుడు బాదిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) బ్యాటర్లు అహ్మదాబాద్‌లో తేలిపోయారు.
- గుజరాత్ టైటాన్స్ సమిష్టి విజయం
- రాణించిన సుదర్శన్, మిల్లర్
SRH | నాలుగు రోజుల క్రితం ఉప్పల్ వేదికగా ముంబైతో ముగిసిన మ్యాచ్‌లో దొరికినబంతిని దొరికినట్టు వీరబాదుడు బాదిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) బ్యాటర్లు అహ్మదాబాద్‌లో తేలిపోయారు. ఫ్లాట్ పిచ్‌పై హార్డ్ హిట్టర్లు చేతులెత్తేయడంతో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో రెండో ఓటమిని మూటగట్టుకుంది. ముందు బౌలింగ్‌తో పాటు ఆ తర్వాత బ్యాటింగ్‌తోనూ నిలకడ ప్రదర్శించిన గుజరాత్ టైటాన్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సుదర్శన్, మిల్లర్లు సమయోచిత ఇన్నింగ్స్ ఆడారు.
అహ్మదాబాద్: ఫలితాలతో సంబంధం లేకుండా గత రెండు మ్యాచ్‌లలో దూకుడుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ మొదటికొచ్చింది. బ్యాటింగ్ వైఫల్యంతో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పాలైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులకే పరిమితమైంది. అభిషేక్ శర్మ (20 బంతుల్లో 29, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (14 బంతుల్లో 29, 3 ఫోర్లు, 1 సిక్సర్)లు టాప్ స్కోరర్లు. అనంతరం ఛేదనను గుజరాత్ ఆడుతూ పాడు తూ పూర్తిచేసింది. సాయి సుదర్శన్ (36 బంతుల్లో 45, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (27 బంతుల్లో 44, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు 19.1 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి హైదరాబాద్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. మోహిత్ శర్మ (3/25)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
రైజర్స్ ఆది నుంచే..
ముంబైతో మ్యాచ్‌లో నరాల్లో కరెంట్ నింపుకున్న వాడిలా ఊగిపోయి ఆడిన ట్రావిస్ హెడ్ (19) గుజరాత్‌తో మాత్రం ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయాడు. అజ్మతుల్లా వేసిన తొలి ఓవర్లోనే బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు కొట్టిన అతడు.. ఏడో ఓవర్లో నూర్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడిన అభిషేక్‌ను మోహిత్ శర్మ తన మొదటి ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేర్చాడు. మార్క్మ్ (17) విఫలమవగా.. ఎస్ఆర్హెచ్ భారీ ఆశలు పెట్టుకున్న హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 24, 1 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించినా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అవడంతో హైదరాబాద్ ఆశలు అడుగంటాయి.
ఆడుతూ పాడుతూ..
మోస్తరు లక్ష్యాన్ని గుజరాత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (25), శుభ్‌మన్ గిల్ (36)లు తొలి వికెట్‌కు 4.1 ఓవర్లలో 36 పరుగులు జోడించారు. సాహాను షాబాజ్ అహ్మద్ వెనక్కి పంపినా సాయి సుదర్శన్‌తో కలిసి గిల్ గుజరాత్‌ను నడిపించాడు. గిల్ ఔట్ అయ్యాక డేంజరస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్.. సుదర్శన్ అండతో మ్యాచ్‌ను పూర్తిగా గుజరాత్ వైపునకు తిప్పేశాడు. హైదరాబాద్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో ఈ ఇద్దరూ స్వేచ్ఛగా పరుగులు సాధించారు.
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్ : 20 ఓవర్లలో 162/8 (అభిషేక్ 29, సమద్ 29, మోహిత్ శర్మ 3/25, నూర్ అహ్మద్ 1/32)
గుజరాత్: 19.1 ఓవర్లలో 168/3 (సుదర్శన్ 45, మిల్లర్ 44 నాటౌట్, కమిన్స్ 1/28, షాబాజ్ 1/20)

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

