DC vs GG : గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సోఫీ డంక్లీ (4) ఔట్ అయింది. మరిజానే కాప్ వేసిన ఆఖరి బంతికి లాంగాఫ్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దాంతో, ఆ జట్టు 4 పరుగులకే కీలకమైన వికెట్ పడింది. ప్రస్తుతం. లారా వోల్వార్డ్త్, హర్లీన్ డియోల్ క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మేగ్ లానింగ్ ఫీల్డింగ్ తీసుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)14వ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) జట్లు బ్రబౌర్న్ స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ టోర్నమెంట్లో నాలుగు విజయాలతో రెండో స్థానంలో ఉన్న పటిష్టమైన ఢిల్లీని గుజరాత్ నిలువరిస్తుందా? అనేది ఆసక్తికరం. గుజరాత్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపైన. దాంతో, ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్ పోటీలో నిలవాలని స్నేహ్ రానా సేన భావిస్తోంది.