చెన్నై : అమిచెస్ ర్యాపిడ్ ఆన్లైన్ టోర్నీలో తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. అర్జున్‌తో పాటు భారత ఆటగాళ్లు గుకేష్, విదిత్ సంతోష్ గుజరాతి నాకౌట్‌కు అర్హత సాధించారు.
ప్రిలిమినరీ పోటీలలో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై సంచలన విజయాలు సాధించిన గుకేష్, అర్జున్ 2, 4 స్థానాలలో నిలిచారు. గుజరాతి 8వ స్థానంతో నాకౌట్‌కు అర్హత సాధించాడు. క్వార్టర్స్‌లో కార్ల్సన్తో అర్జున్ తలపడతాడు.