యాక్షన్ గేమ్స్ పక్కనపెట్టండి.. గూగుల్ డూడుల్‌తో ఒలింపిక్ గేమ్స్ ఆడతారా?

టోక్యో: ప్రపంచంలోనే మెగా క్రీడా సంబురం ఒలింపిక్స్ ప్రారంభమవుతున్న వేళ గూగుల్ డూడుల్ యూజర్లకు ఓ భిన్నమైన అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తోంది. అథ్లెట్లు అక్కడ మైదానాల్లో మెడల్స్ కోసం పోటీ పడుతుంటే.. ఇక్కడ మీరు ఇంట్లో కూర్చొనే ఆ ఒలింపిక్ గేమ్స్ ఆడేయొచ్చు. డూడుల్ చాంపియన్ ఐలాండ్ గేమ్స్‌గా పిలుస్తున్న వీటిని చాలా క్రియేటివ్‌గా రూపొందించారు. వచ్చే రెండు వారాల పాటు ఈ ఏడు మినీ గేమ్స్ సిరీస్‌ను ఆడే చాన్స్ ఉంటుంది. ఈ డూడుల్‌ను జపాన్‌కు చెందిన Studio 4°C కంపెనీ క్రియేట్ చేసింది.
ఏంటీ గేమ్స్.. ఎలా ఆడాలి?
ఇందులో నాలుగు టీమ్స్ ఉంటాయి. రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో. వీటిలో ఏదో ఒక టీమ్‌ను సెలెక్ట్ చేసుకొని మన స్కోరును దానికి ఇవ్వొచ్చు. ఈ స్కోర్లను గూగుల్ ట్రాక్ చేస్తుంది. టేబుల్ టెన్నిస్, క్లైంబింగ్, స్కేట్బోర్డింగ్, ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, రగ్బీ, మారథాన్ రన్నింగ్ ఈవెంట్లలో కాలికో నింజా క్యాట్ లక్కీ పాల్గొంటుంది. ఈ ప్రతి గేమ్‌కూ జపాన్ చరిత్ర, అక్కడి జానపద కథల పాత్రలు లెజెండరీ చాంపియన్‌గా ఉంటాయి.
ముందుగా జపాన్‌లోని కథలు, జానపద కథలలోని ప్రముఖ పాత్రలను గుర్తించాం. ఆ పాత్రలను ఇందులోని ఒక్కో గేమ్‌కు అనుసంధానించాం అని సదరు స్టూడియో వెల్లడించింది. డిజైన్‌లో ఆ స్టోరీల నుంచి పాత్రలను ఒక్కో ఈవెంట్‌కు చాంపియన్‌గా ఎంపిక చేశాం.
అంతేకాదు టీమ్ మస్కట్లయిన కప్పా, యటగరసు, లయన్ డ్యాన్స్‌లాంటివి కూడా వాటి నుంచే తీసుకున్నాం. ప్రతి చాంపియన్ క్యారెక్టర్ డిజైన్ స్టోరీలోని అసలు ఇమేజ్‌కు అనుగుణంగానే రూపొందించామని స్పష్టంచేసింది. ఇప్పటికే ఈ డూడుల్ గేమ్స్ ప్రారంభం కాగా.. టీమ్ రెడ్ లీడ్‌లో ఉంది.
Welcome to the Doodle Champion Island Games!
— Google Doodles (@GoogleDoodles) July 23, 2021
In this interactive #GoogleDoodle, join calico (c)athlete Lucky as she explores a 🌎 filled with sports, legendary opponents, and daring side quests.
Are you feline Lucky? 😸 The epic adventure starts now → https://t.co/vwQJuO8FjM pic.twitter.com/3cVHjFbNpG
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

