Vinesh Phogat | నాపై రెజ్లింగ్ గెలిచింది.. నేను ఓడిపోయా.. కుస్తీకి వినేశ్ ఫోగాట్ గుడ్‌బై
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat) రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. పారిస్ గడ్డపై త్రివర్ణపతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించాలనుకున్నా ఆమె ఆశలకు అదనపు బరువు గండికొట్టింది. దీంతో ఆమె రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat) రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. పారిస్ గడ్డపై త్రివర్ణపతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించాలనుకున్న ఆమె ఆశలను అదనపు బరువు తుడిచివేసింది. దీంతో రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘రెజ్లింగ్ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించు. మీక, నా ధైర్యం విచ్ఛిన్నమైంది. నాకు ఇంకా పోరాడే బలం లేదు’ అని పేర్కొంది. రెజ్జింగ్ 2001-2024 గుడ్‌బై అంటూ ట్వీట్ చేసింది.
పారిస్ ఒలింపిక్స్ 50 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్.. నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది. అయితే తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఫోగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేసన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. తనను సిల్వర్ మెడల్‌కు అర్హురాలినని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తున్నది. దీనిపై ఆర్బిట్రేషన్ తీర్పు వెలువరించాల్సి ఉన్నది. ఈలోపే ఆమె అనూహ్యంగా వీడ్కోలు ప్రకటించింది.
గత రెండు ఒలింపిక్స్‌లను తలపిస్తూ పారిస్‌లోనూ వినేశ్‌కు చేదు అనుభవమే ఎదురైంది. రియోలో కాలు విరిగితే..టోక్యోలో ఆదిలోనే ఓటమి..ఇప్పుడు పారిస్‌లో అనర్హత వేటు ఫోగాట్ పతక కలను చిదిమేశాయి. గత ఏడాది కాలంగా పాలకులతో చేస్తున్న పోరాటం ఓవైపు అయితే తనపై వస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం చెప్పేందుకు బౌట్లో శక్తికి మించి పోరాడిన వినేశ్..పారిస్‌లో పతకమే లక్ష్యంగా పోటీకి దిగింది. తన రెగ్యులర్ విభాగం 53కిలోలు కాకుండా ఈసారి 50కిలోల కేటగిరీ ఎంచుకున్న ఫోగాట్‌కు యు సుసాకీ రూపంలో ఫెవరేట్ ఎదురైనా వెరువకుండా పోరాడి సంచలన విజయం సాధించింది. అదే జోరులో క్వార్టర్స్, సెమీస్ బౌట్లలో ప్రత్యర్థులను చిత్తుచేసి ఫైనల్ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా నిలిచింది.
माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।
अलविदा कुश्ती 2001-2024 🙏
आप सबकी हमेशा ऋणी रहूँगी माफी 🙏🙏
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

