హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ యంగ్ షట్లర్ నిమ్మ శాన్వి రెడ్డి డబుల్ గోల్డ్ మెడల్స్‌తో సత్తా చాటింది. గర్ల్స్ అండర్15 సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో చాంపియన్‌గా నిలిచింది.
హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ శాన్వి 15-12, 12-15, 15-12తో కోరుకొండ ల్యోషాపై విజయం సాధించింది. డబుల్స్‌లో శాన్వి-ల్యోషా జోడీ 15-11, 9-15, 15-10తో టాప్ సీడ్ అభా జాదవ్-దియా ఆనంద్ ద్వయంను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. దీంతో పాటు బెంగళూరులో జరిగే నేషనల్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను కూడా శాన్వి ఎంపికైంది.