న్యూయార్క్ : సాకర్ ప్రపంచకప్ ముగింపు వేడుకల్లో గ్లోబల్ సూపర్ స్టార్స్ సందడి చేయనున్నారు. న్యూజెర్సీ స్టేడియంలో ఆదివారం అర్ధరాత్రి జరిగే ఫైనల్కు ముందు నిర్వహించే వేడుకల్లో టామ్ క్రూస్, లారా పాసిని, నికోల్ షెర్జింగర్, రాబీ విలియమ్స్, స్పీడ్ వంటి ప్రపంచ ప్రముఖుల ప్రదర్శన అభిమానులను ఉర్రూతలూగించనుంది.
ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన అమెరికన్ సింగర్ జెన్నిఫర్ హడ్సన్ ఫైనల్ మ్యాచ్ ముందు యూఎస్ఏ జాతీయ గీతాన్ని ఆలపిస్తుందని ఫిఫా తెలిపింది. ఈ వేడుకల్లో హడ్సన్ ప్రదర్శన హైలైట్గా నిలుస్తుందని పేర్కొంది.