ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్‌లో బాయ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసిన అమ్మాయి.. వీడియో వైరల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మ్యాచ్‌లో ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఓ యువతి తన స్నేహితుడికి ప్రపోజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వీరిద్దరూ కూడా ఆర్సీబీ అభిమానులే. వీరి లవ్ ప్రపోజల్‌కు పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికైంది.
చైన్నె సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో(11 ఓవర్లో) ఆ యువతి ఆర్సీబీ జెర్సీ ధరించిన తన బాయ్‌ఫ్రెండ్‌కు లవ్ ప్రపోజ్ చేసింది. తన మోకాళ్లపై కూర్చొని.. తన బాయ్‌ఫ్రెండ్‌కు ఉంగరాన్ని బహుకరించింది. అతను కూడా ఆమె ప్రేమను అంగీకరించాడు. ఇద్దరూ కౌగిలించుకుని తమ ప్రేమను వ్యక్తపరిచారు. దీంతో అక్కడున్న వారంతా చప్పట్లతో వారి ప్రేమకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ అరుదైన దృశ్యాలను మ్యాచ్‌ను కవర్ చేస్తున్న ఓ కెమెరామెన్ తన కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఆర్సీబీ అభిమానుల ప్రేమపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన జీవిత భాగస్వామిగా ఆర్సీబీ అభిమానిని ఎంచుకోవడంలో ఆ యువతి సరైన నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. అతను ఆర్సీబీకి విధేయుడిగా ఉండగలిగితే, అతను కచ్చితంగా తన భాగస్వామికి విధేయుడిగా ఉండగలడని జాఫర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Girl proposes at CSK vs RCB game pic.twitter.com/ef8Wk3HTkX
— Tushar (@Tushar72991364) May 4, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

