GT vs LSG | లక్నో గడ్డపై దంచేసిన గిల్, బట్లర్.. గుజరాత్‌కు రెండో విజయం..!
GT vs LSG : పంతొమ్మిదో సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరసగా రెండో విజయం సాధించింది. ఓపెనర్ సాయి సుదర్శన్(15) త్వరగా ఔటైనా శుభ్‌మన్ గిల్(56) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.
GT vs LSG : పంతొమ్మిదో సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరసగా రెండో విజయం సాధించింది. ఓపెనర్ సాయి సుదర్శన్(15) త్వరగా ఔటైనా శుభ్‌మన్ గిల్(56) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లను సులువుగా ఎదుర్కొన్న జోస్ బట్లర్(60), గిల్ గుజరాత్‌ను గెలుపు దిశగా నడిపారు. రెండో వికెట్‌కు అర్ధ శతక భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ద్వయం వెంటవెంటనే ఔటైనా.. వాషింగ్టన్ సుందర్(21 నాటౌట్) లాంఛనం పూర్తి చేశాడు. ఏడు వికెట్లతో గెలుపొందిన గుజరాత్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.
సొంత మైదానంలో పంజా విసరాలనుకున్న లక్నో సూపర్ జెయింట్స్(LSG)కు భారీ షాకిచ్చింది గుజరాత్ టైటాన్స్. తొలుత ప్రసిధ్ కృష్ణ() సంచలన స్పెల్‌తో లక్నోను 164కే కట్టడి చేసిన గుజరాత్ మోస్తరు లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఓపెనర్ సాయి సుదర్శన్(15) విఫలమైనా శుభ్‌మన్ గిల్(56) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. లక్నో బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వని గిల్.. జోస్ బట్లర్(60) స్కోర్ బోర్డును ఉరికించారు. గిల్ కళాత్మక షాట్లతో అలరించగా.. బట్లర్ స్కూప్, రివర్స్ స్వీప్ షాట్లతో చెలరేగాడు.
Jos Buttler is putting on a complete masterclass out in the middle 👊
14,000 T20 runs and a monumental 100th T20 FIFTY for the Englishman 👏
Updates ▶️ https://t.co/kIuuJYbiNx#TATAIPL | #KhelBindaas | #LSGvGT | @gujarat_titans pic.twitter.com/UnmUIcgqpC
— IndianPremierLeague (@IPL) April 12, 2026
రెండో వికెట్‌కు 84 పరుగులు జోడించిన గిల్‌ను ప్రిన్స్ యాదవ్ వెనక్కి పంపాడు. కాసేపటికే షమీ ఓవర్లో బట్లర్ సిక్సర్‌కు యత్నించి బౌండరీ వద్ద మర్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. వెంట వెంటనే రెండు వికెట్లు పడినా.. వాషింగ్టన్ సుందర్(21 నాటౌట్)తో కలిసి రాహుల్ తెవాటియా(10 నాటౌట్)లు ఒత్తిడికి లోనవ్వలేదు. ప్రిన్స్ ఓవర్లో 4, 6 బాదిన సుందర్ లాంఛనం పూర్తి చేశాడు. దాంతో.. వరసగా సన్‌రైజర్స్, కోల్‌కతాపై గెలుపొందిన లక్నోకు ఓటమి తప్పలేదు.
ప్రసిధ్ దెబ్బకు విలవిల
పంతొమ్మిదో సీజన్లో హ్యాట్రిక్ కొట్టాలనుకున్న లక్నో సూపర్ జెయింట్స్ మోస్తర్ స్కోర్‌కే పరిమితమైంది. సొంత మైదానంలో చెలరేగిపోవాలనుకున్న లక్నో జట్టుకు గుజరాత్ టైటన్స్ పేసర్ ప్రసిధ్ కృష్ణ(4-28) షాకిచ్చాడు. పవర్ ప్లేలోనే కగిసో రబడ(1-54), ప్రసిధ్ ధాటికి రెండు వికెట్లు కోల్పోయిన లక్నో ఏ దశలోనూ పుంజుకోలేదు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన గుజరాత్ పేసర్లు లక్నో హిట్టర్లకు బ్యాట్ ఝులిపించే అవకాశమివ్వలేదు.
ప్రసిధ్ కృష్ణ(4-28)

ప్రసిధ్ ధాటికి 69కే మూడు వికెట్లు పడిన వేళ పవర్ హిట్టర్ ఆయుశ్ బదొని(9), నికోలస్ పూరన్(19)లు లక్నోను ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఈ ఇద్దరి సైతం వెనక్కి పంపిన ప్రసిధ్ స్కోర్ వేగానికి బ్రేకులు వేశాడు. కుర్రాళ్లు అబ్దుల్ సమద్(18), ముకుల్ చౌదరీ(18) మెరవగా.. ఆఖర్లో ఇంప్యాక్ట్ సబ్ జార్జ్ లిండే(16)ధనాధన్ ఆడడంతో ఆ జట్టు 160 పరుగులు చేయగలిగింది. ఆఖరి ఓవర్లో షమీ(12 నాటౌట్) సిక్సర్ బాదడంతో లక్నో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేయగలిగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
ట్రెండింగ్ వార్తలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్

