సావొపోలో: బ్రిటన్ రేసర్ జార్జి రస్సెల్ బ్రెజిల్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేస్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం ఆసక్తిగా సాగిన రేసులో రస్సెల్ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని విజేతగా నిలిచాడు. దీంతో ఈ రేసులో ఇద్దరు బ్రిటన్ రేసర్లు తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు.