బర్మింగ్‌హామ్: స్వలింగ సంపర్క అథ్లెట్లు భయపడాల్సిన అవసరం లేదని భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ అంది. ఒక అమ్మాయితో కలిసి సంబంధం కొనసాగిస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనికి తోడు కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే కామన్వెల్త్ గేమ్స్ టార్చ్ రిలేలో బ్రిటన్ స్టార్ డైవర్ టామ్ డాలేతో కలిసి ద్యుతి వేదిక పంచుకుంది.
ఎల్జీబీటీక్యూకు మద్దతుగా టామ్, ద్యుతితో పాటు మరికొంత మంది అథ్లెట్లు ఈ రిలేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒడిశా అథ్లెట్ మాట్లాడుతూ ‘ఎల్జీబీటీక్యూ అథ్లెట్లు అభద్రతా భావం వీడాలి. ఎలాంటి భయం లేకుండా, చావుకు వెరకవకుండా జీవించాలి. టామ్‌తో కలిసి గడపడం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ప్రిన్స్ చార్లెస్‌ను కలిసే అవకాశం నాకు దక్కింది’ అని చెప్పుకొచ్చింది.