GT vs CSK : పంతొమ్మిదో సీజన్లో విఫలమవుతున్న రుతురాజ్ గైక్వాడ్(74 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆడుకున్నాడు. చిదంబరం స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ పేసర్ రబడ(3-25) ధాటికి పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయిన చెన్నైని గైక్వాడ్ గట్టెక్కించాడు. 37 కే నాలుగు వికెట్లు పడినా.. శివం దూబే(22), కార్తిక్ శర్మ(15), జేమీ ఓవర్టన్(18)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఆఖరి ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లతో సీఎస్కేకు పోరాడగలిగే స్కోరందించాడు.
సొంత మైదానంలో దంచేస్తారనుకుంటే చెన్నై సూపర్ కింగ్ హిట్టర్లలు వరసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. టాస్ ఓడిన జట్టుకు శుభారంభం ఇస్తారనుకుంటే పేసర్ రబడ (3-25) ధాటికి గత మ్యాచ్ శతక వీరుడు సంజూ శాంసన్(11) ఔటవ్వగా.. కొత్త కుర్రాడు ఉర్విల్ పటేల్(4)ను సైతం రబడ వెనక్కి పంపాడు. ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్(0)ను సిరాజ్ .. డేంజరస్ డెవాల్డ్ బ్రెవిస్(2)ను మానవ్ సుతార్ పెవిలియన్ చేర్చారు. అంతే.. మైదానంలో నిశబ్దం ఆవహించింది. చూస్తుండగానే నాలుగు వికెట్లు పడిన వేళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(74 నాటౌట్), శివం దూబే(22)లు ఆచితూచి ఆడారు.
Run rate on the rise for #CSK 📈
🎥 Ruturaj Gaikwad and Shivam Dube with vital hits 👌
Updates ▶️ https://t.co/zJBovAaCoM #TATAIPL | #KhelBindaas | #CSKvGT | @ChennaiIPL pic.twitter.com/rW6jOeNSVl
— IndianPremierLeague (@IPL) April 26, 2026
గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గైక్వాడ్, దూబేలు పెద్ద షాట్లకు యత్నించలేదు. ఒక్క బౌండరీ రాకపోవడంతో నెట్‌రన్‌రేటు నాలుగు లోపే ఉంది. అయితే.. హోలర్డ్ వేసిన 12వ ఓవర్ చివరి బంతికి దూబే బౌండరీతో స్కోర్ యాభై దాటింది. ఆ తర్వాత అర్షద్ ఓవర్లో గేర్ మార్చిన గైక్వాడ్ రెండు సిక్సర్లతో ఊపు తెచ్చాడు. రషీద్ ఓవర్లో దూబే 4, 6 గైక్వాడ్ బౌండరీతో 21 రన్స్ పిండుఉకన్నారు.
Captain stepping up when needed most 🫡
Ruturaj Gaikwad compiles his 2⃣1⃣st #TATAIPL fifty to lead #CSK‘s revival 💛
Updates ▶️ https://t.co/zJBovAaCoM #KhelBindaas | #CSKvGT pic.twitter.com/g9u4XefJBx
— IndianPremierLeague (@IPL) April 26, 2026
అయితే.. అర్షద్ సూపర్ డెలివరీకి దూబే ఆఫ్ స్టంప్ ఎగిరిపోవడంతో ఐదో వికెట్ 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సిరాజ్ ఓవర్లో సిక్సర్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు. కార్తిక్ శర్మ(15) మెరుపులకు 19వ ఓవర్లో ఓవర్టన్(18) 4, 6, 4 రాబట్టడంతో స్కోర్ 140 దాటింది. సుతార్ వేసిన చివరి ఓవర్లో గైక్వాడ్ 6, 4, 4 తో ప్రత్యర్థికి సీఎస్కే 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.