పారిస్ : ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌కు ఆదివారం తెర లేవనున్నది. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ గైర్హాజరులో టైటిల్ పోరులో టాప్‌సీడ్ కార్లోస్ అల్కారజ్, నొవాక్ జొకోవిచ్, హోల్గర్ రూనె, డేనియల్ మెద్వెదెవ్, కాస్పర్ రూడ్, మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఇగా సియాటెక్, అరినా సబలెంక, ఎఇరనా సబలెంక, కొకొ గాఫ్, ఆన్స్ జేబర్ టైటిల్ సమరానికి సన్నద్ధమయ్యారు. పురుషుల విభాగంలో జొకోవిచ్ రికార్డు స్థాయిలో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేశాడు. రెండు వారాలపాటు టెన్ని స్ అభిమానులకు కనులవిందు చేసేందుకు ఆటగాళ్లు సన్నద్ధమయ్యారు.