ఫిఫా ఫైనల్లో అర్జెంటీనాతో ఫ్రాన్స్ ఢీ
ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ వరుస విజయాల ప్రస్థానం కొనసాగుతున్నది. లీగ్ దశలో ట్యునీషియా చేతిలో అనూహ్య ఓటమి మినహాయిస్తే.. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్లు ఫ్రాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది.
- ఆదివారం ఫిఫా ఫైనల్
- సెమీస్‌లో మొరాకోపై అద్భుత విజయం
ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ వరుస విజయాల ప్రస్థానం కొనసాగుతున్నది. లీగ్ దశలో ట్యునీషియా చేతిలో అనూహ్య ఓటమి మినహాయిస్తే.. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్లు ఫ్రాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. మేటి జట్లకు కొరకరాని కొయ్యగా మారి అంచనాలకు మించి
రాణించిన మొరాకో గెలుపు జోరుకుసెమీస్లో ఫ్రాన్స్ బ్రేకులు వేసింది. పటిష్ఠ డిఫెన్స్‌తో ప్రత్యర్థులకు వణుకు పుట్టించిన మొరాకో ఆటలు ఫ్రాన్స్ ముందు సాగలేదు.
ఆది నుంచే తమ ఆధిపత్యం ప్రదర్శించిన ఫ్రెంచ్ టీమ్.. మొరాకోను మట్టికరిపించి అర్జెంటీనాతో ప్రపంచకప్ ఆఖరి సమరంలో నిలిచింది. స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపె అన్నీతానై దాడులకు నాయకత్వం వహించిన వేళ ముచ్చటగా మూడోసారి కప్‌ను ముద్దాడేందుకు ఫ్రాన్స్ మరో అడుగుదూరంలో నిలిచింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో కోట్లాది మంది అభిమానుల మద్దతు పొందిన మొరాకో చిరస్మరణీయ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

అల్ ఖోర్: ఫిఫా ప్రపంచకప్‌లో ఫైనల్ ప్రత్యర్థులు ఖరారయ్యారు. క్రొయేషియాపై అద్భుత విజయంతో అర్జెంటీనా ఆఖరి సమరానికి అర్హత సాధిస్తే.. ఆఫ్రికా నయా సంచలనం మొరాకో మెడలు వంచి ఫ్రాన్స్ తుది పోరులో నిలిచింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2-0 తేడాతో మొరాకోపై విజయం సాధించింది. ఫ్రెంచ్ టీమ్ తరఫున థియో హెర్నాండెజ్ (5ని), రాండర్ కోలో మౌని (79ని) గోల్స్ చేశారు. బంతిని 55 శాతం తమ ఆధీనంలో ఉంచుకున్న మొరాకో..లక్ష్యంపై ఒకసారికే దాడికి పరిమితం కాగా, ఫ్రాన్స్ రెండింటికి రెండు ప్రయత్నాల్లో సఫలమైంది. ఫ్రాన్స్‌తో సెమీస్ మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థులకు ఒకే గోల్ ఇచ్చుకున్న మొరాకో ఫ్రాన్స్‌కు దీటైన పోటీనివ్వలేకపోయింది. గాయంతో కొంత మంది కీలక ప్లేయర్లు దూరం కావడం మొరాకో గెలుపు అవకాశాలపై ప్రభావం చూపింది. ఓవైపు ఆఫ్రికా ఖండం నుంచి సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచిన మొరాకో సంచలన విజయాలతో మెగాటోర్నీని వీడితే డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఫ్రాన్స్ ఫైనల్లో నిలిచింది.
ఎంబాపె అన్నీ తానై: లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వారసునిగా మన్ననలు అందుకుంటున్న ఫ్రాన్స్ స్టార్ ఫార్వర్డ్ కిలియన్ ఎంబాపె.. మొరాకోతో సెమీస్‌లో అన్నీతానై ముందుండి నడిపించాడు. పటిష్ఠ మొరాకో డిఫెన్స్‌ను బద్దలు కొడుతూ ఫ్రాన్స్‌కు చిరస్మరణీయ విజయం దక్కడంలో కీలకమయ్యాడు. మ్యాచ్ మొదలైన ఐదో నిమిషంలోనే ఫ్రాన్స్ గోల్ ఖాతా తెరిచింది. పెనాల్టీ ఏరియాలో ఎంబాపె అందించిన పాస్‌ను హెర్నాండెజ్..మొరాకో గోల్‌కీపర్ యాసైన్ బొన్యును కంగుతినిపిస్తూ గోల్ చేశాడు. ఇక్కడి నుంచి తమ దాడులకు మరింత పదును పెంచిన ఫ్రాన్స్..మొరాకోకు ఎక్కడా అవకాశమివ్వలేదు.
పలుమార్లు మొరాకో పుంజుకునే ప్రయత్నం చేసినా ఫ్రాన్స్ దీటుగా తిప్పికొట్టింది. మొరాకో దూకుడును నిలువరించేందుకు ఫ్రాన్స్ కోచ్ దిదిర్ దెస్చాంప్స్..సబ్స్టిట్యూట్లను దింపడం మ్యాచ్‌ను గతిని మార్చేసింది. మైదానం మొత్తం చిరుతలా కదులుతున్న ఎంబాపెను లక్ష్యంగా చేసుకున్న మొరాకో దురుసుగా అడ్డుకోవడంతో ఫ్రాన్స్ శిబిరంలో ఒకింత అలజడి చెలరేగింది. అయితే వెంటనే తేరుకున్న ఎంబాపె మళ్లీ మైదానంలో అడుగుపెట్టడంతో ఫ్రాన్స్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
మ్యాచ్ 79వ నిమిషంలో తనను నీడలా వెంటాడుతున్న మొరాకో డిఫెండర్లను కంగుతినిపిస్తూ పెనాల్టీ ఏరియాలో ఎంబాపె అందించిన పాస్‌ను అప్పుడే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రాండల్ కోలో గోల్‌గా మలచడంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఫ్రాన్స్ చక్రబంధంలో ఇరుక్కుపోయిన మొరాకో కడదాకా పోరాటం చేసినా లాభం లేకపోయింది. రిఫరీ ఫైనల్ విజిల్ వేయడంతో మొరాకో ప్లేయర్లు నిర్వేదంలో కూరుకుపోయారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మక్రాన్ సెమీస్ పోరును ప్రత్యక్షంగా వీక్షించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

