FIFA World Cup | ప్చ్.. ఫ్రాన్స్ కథ ముగిసె.. నంబర్ 1 ర్యాంక్ ఎందుకనో అచ్చిరావట్లే..!
FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్‌లో ఫేవరెట్ ఫ్రాన్స్(France) జట్టు సెమీఫైనల్ దాటలేకపోయింది. నంబర్ 1 ర్యాంకర్‌గా టోర్నీలో అడుగుపెట్టిన కిలియన్ ఎంబాపే(Kylian Mbappe) బృందం స్పెయిన్ చేతిలో ఊహించని ఓటమితో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగించింది.
FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్‌లో ఫేవరెట్ ఫ్రాన్స్(France) జట్టు సెమీఫైనల్ దాటలేకపోయింది. నంబర్ 1 ర్యాంకర్‌గా టోర్నీలో అడుగుపెట్టిన కిలియన్ ఎంబాపే(Kylian Mbappe) బృందం స్పెయిన్ చేతిలో ఊహించని ఓటమితో ఇంటిదారి పట్టి.. ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగించింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో నంబర్ 1 జట్టు కప్ కొట్టలేదు ఇంతవరకు. ఈ పరంపర ఇటీవల మొదలైంది కాదు.1994 నుంచి ఇదే సీన్ రిపీట్ అవుతూనే ఉంది. ఫిఫా గత రికార్డులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
ఆట ఏదైనా నంబర్ 1 ర్యాంక్‌లోని జట్లు, ఆటగాళ్లు ప్రధాన టోర్నీల్లో విజేతగా నిలవడం చూశాం. హాకీ, క్రికెట్, టెన్నిస్.. వంటివాటిలో టాప్ ర్యాంకర్స్ కప్ కొట్టిన సంఘటనలు చాలానే. కానీ, ఫుట్‌బాల్ జట్లకు మాత్రం ఎందుకనో అగ్రస్థానం కలిసిరావడం లేదు. మెక్సికో, కెనడా, అమెరికా ఆతిథ్యమిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఫ్రాన్స్ నిష్క్రమణతో.. ఈ ఫస్ట్ ర్యాంక్ ఫోబియా నిజమనిపిస్తోంది. 1994 నుంచి ఇప్పటివరకూ టాప్ ర్యాంకర్ జట్టు ఛాంపియన్ కాలేదు. అసలు ఇదంతా ఎప్పుడు మొదలైందో తెలుసా.. 1993లో.
వరల్డ్‌కప్ ట్రోఫీతో బ్రెజిల్, జర్మనీ ఆటగాళ్లు

బ్రెజిల్‌తో ఆరంభం..
తొలిసారిగా 1993లో ఫిఫా యాజమాన్యం ర్యాంకింగ్స్ ప్రకటించింది. అప్పటి నుంచి 2, 3 లేదా 4 వ ర్యాంకు.. ఆపై స్థానంలోని జట్లే కప్‌ను తన్నుకుపోయాయి. ఫిఫా ర్యాంకింగ్స్‌లో 2వ స్థానంలోని, కార్లోస్ డుంగా సారథ్యంలోని బ్రెజిల్ (Brazil) 1994లో ఛాంపియన్ కాగా.. 1998వ ఎడిషన్‌లో 14వ స్థానంతో బరిలోకి దిగిన ఫ్రాన్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ విజేతగా నిలిచింది.

ఇదే ఒరవడిని కొనసాగిస్తూ 2022లో మళ్లీ రెండో స్థానంలోని బ్రెజిల్ కప్‌ను ముద్దాడింది. 2006 ఎడిషన్‌లో 13వ ర్యాంకర్ ఇటలీ(Italy) ట్రోఫీని ఎగరేసుకుపోగా.. రెండో ర్యాంకర్లైన స్పెయిన్(Spain) 2010లో, జర్మనీ 2014లో ఫిఫా వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకున్నాయి. 2018లో ఫ్రాన్స్(7వ ర్యాంక్) విజేతగా నిలిచింది. ఖతార్ వేదికగా జరిగిన 2022 ఎడిషన్‌లో 3వ ర్యాంకర్ అర్జెంటీనా(Argentina) కప్ కొట్టింది.

ఈసారి (2026) కూడా అదే సంప్రదాయం కొనసాగగా.. నంబర్ 1 ఫ్రాన్స్ సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టింది. ప్రస్తుతం లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా రెండో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 4వ ర్యాంక్‌లో, ఫైనల్‌కు దూసుకెళ్లిన స్పెయిన్ 3వ స్థానంలో ఉన్నాయి. రెండో సెమీస్ ఫలితం తేలినా.. ఈ దఫాలోనూ కప్ కొట్టే జట్టు నంబర్ వన్ కాదనేది మరోసారి నిరూపితం కానుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

