మియామి: వెస్టిండీస్ మాజీ వికెట్‌కీపర్ డేవిడ్ ముర్రే (72) శనివారం మృతి చెందారు. ముర్రే వెస్టిండీస్ జాతీయ జట్టుకు 1978-1982 మధ్య కాలంలో 19 టెస్టులు, 10 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించారు. ముర్రే విండీస్ మాజీ దిగ్గజం ఎవర్టన్ వీక్స్ కుమారుడు. 1983 తిరుగుబాటు జట్టుతో దక్షిణాఫ్రికా పర్యటనతో ముర్రే నిషేధానికి గురవడంతో అతని కెరీర్ ముగిసింది.