MS Dhoni | అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో గోల్ఫ్ ఆడిన ధోనీ..! వీడియో వైరల్..!
MS Dhoni | భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారత్ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన మిస్టర్ కూల్.. క్రికెట్‌తో పాటు పలు క్రీడలంటే ఎంతో మక్కువ.
MS Dhoni | భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారత్ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన మిస్టర్ కూల్.. క్రికెట్‌తో పాటు పలు క్రీడలంటే ఎంతో మక్కువ. ధోనీకి ఫుట్‌బాల్ ఎంతో ప్రేమ. అదే సమయంలో టెన్నిస్‌ను సైతం చాలా ఇష్టం.. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో కార్లోస్ అల్కరాజ్ ఆడుతున్న మ్యాచ్‌ను చూసేందుకు ధోని ఇటీవల అమెరికాకు చేరుకున్నాడు. అల్కరాజ్ను కలిసిన, మ్యాచ్ చూస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రంప్ న్యూజెర్సీ బెడ్‌మిన్‌స్టర్‌లోని నేషనల్ గోల్ఫ్ క్లబ్లో గోల్ఫ్ ఆడేందుకు భారత మాజీ కెప్టెన్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో కలిసి మహి గోల్ఫ్‌ను ఆస్వాదించాడు. ధోని వెంట దుబాయికి చెందిన వ్యాపారవేత సంఘ్వీ సైతం ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అమెరికా మాజీ ప్రెసిడెంట్‌తో ధోనీ గోల్ఫ్ ఆడిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

