UAE Head Coach | యూఏఈ హెడ్‌కోచ్‌గా భారత టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మేనేజర్
UAE Head Coach | భారత్ నెగ్గిన ఏకైక టీ20 వరల్డ్ కప్ టీమ్‌కు మేనేజర్‌గా పనిచేసిన లాల్‌చంద్.. 2016-17లో అఫ్గానిస్తాన్ టీమ్‌కు హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. లాల్‌చంద్ హయాంలోనే అఫ్గానిస్తాన్.. సంచలన విజయాలతో ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్ర వేసింది.
UAE Head Coach | ఐసీసీ 2007లో దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో ట్రోఫీ నెగ్గిన భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించిన మాజీ టెస్ట్ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ మరో విదేశీ టీమ్‌కు హెడ్‌కోచ్‌గా వెళ్లనున్నాడు. కోచ్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఆయన.. తాజాగా యూఏఈ సీనియర్ మెన్స్ క్రికెట్ టీమ్‌కు హెడ్‌కోచ్‌గా ఎంపికయ్యాడు. ఈ ఏడాది అమెరికా/వెస్టిండీస్ వేదికగా జరుగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొంటున్న యూఏఈ.. ఆ టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు గాను లాల్‌చంద్ రాజ్‌పుత్‌ను హెడ్‌కోచ్‌గా తీసుకుంది.
భారత్ నెగ్గిన ఏకైక టీ20 వరల్డ్ కప్ టీమ్‌కు మేనేజర్‌గా పనిచేసిన లాల్‌చంద్.. 2016-17లో అఫ్గానిస్తాన్ టీమ్‌కు హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. లాల్‌చంద్ హయాంలోనే అఫ్గానిస్తాన్.. సంచలన విజయాలతో ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్ర వేసింది. ఆ జట్టుకు టెస్టు స్టేటస్ దక్కింది కూడా లాల్‌చంద్ పీరియడ్‌లోనే కావడం గమనార్హం. ఆ తర్వాత జింబాబ్వే జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేసిన లాల్‌చంద్.. 2022లో ఆ జట్టు టీ20 వరల్డ్ కప్‌లో క్వాలిఫై కావడంలో ఆయన కృషి ఎంతో ఉంది. అప్పటిదాకా అనామక జట్టుగా ఉన్న జింబాబ్వే.. గత టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ వంటి అగ్రశ్రేణి జట్టుకు షాకిచ్చింది.
Lalchand Rajput appointed UAE men’s national team’s head coach.
More details: https://t.co/2Ip61fMHrE pic.twitter.com/aFxpcfR7NX— UAE Cricket Official (@EmiratesCricket) February 21, 2024
తాజాగా లాల్‌చంద్ యూఏఈకి హెడ్‌కోచ్‌గా మూడేండ్ల కాంట్రాక్టుపై వెళ్లనున్నాడు. ఈనెల 28 నుంచే ఆయన పని మొదలవనుంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్‌లో భాగంగా యూఏఈ.. స్కాట్లాండ్, కెనడాలతో ఈనెల 28 నుంచి ముక్కోణపు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ నుంచే లాల్‌చంద్.. యూఏఈకి హెడ్‌కోచ్‌గా సేవలందించనున్నాడు. అఫ్గాన్, జింబాబ్వే జట్లను ఓ మార్గంలో పెట్టిన లాల్‌చంద్.. తమ టీమ్‌కూ అలాంటి సక్సెస్సే అందిస్తాడని యూఏఈ క్రికెట్ పెద్దలు భావిస్తున్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు గాను లాల్‌చంద్.. యూఏఈ క్రికెట్ బోర్డుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

